CM Chandrababu : అమరావతి – మిర్చి రైతులు ఎవరూ కూడా నష్ట పోవడానికి వీలు లేదన్నారు సీఎం నారా చంద్రబాబు(CM Chandrababu) నాయుడు. ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామని, ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆరుగాలం శ్రమించి పండించిన మిర్చి పంటకు కనీస మద్దతు ధర లభించేలా కృషి చేస్తామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. మీకు ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. సచివాలయంలో రైతులతో సమీక్ష చేపట్టారు.
CM Chandrababu Interesting Comments on Mirchi Farmers
మిరప సాగుకు ఏటికేడు పెట్టుబడి పెరుగుతోందని, పెరిగిన పెట్టుబడి స్థాయిలో తమకు ఆదాయం రావడం లేదని రైతులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా మిర్చికి నల్లతామర తెగులుతో పంట నాణ్యత తగ్గడంతో పాటు దిగుబడి తగ్గిపోతోందని రైతులు తెలిపారు. ఎకరాకు రూ.3 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకూ ఖర్చు అవుతోందని వివరించారు. కూలీ ఖర్చులు ఎప్పుడూ లేని విధంగా ఈ సారి మరింత పెరిగాయన్నారు. అయినా కూలీలు దొరకడం లేదని అన్నారు.
ఎన్నో వ్యయ ప్రయాసలతో యార్డుకు పంటను తెస్తే ఉదయం పూట నిర్ణయించిన ధర మళ్లీ మచ్చుకు వచ్చిన తర్వాత ఉండటం లేదన్నారు. క్వింటాకు రూ.500 చొప్పున వ్యాపారులు తగ్గిస్తున్నారని తెలిపారు. దీనిపై ప్రశ్నిస్తే క్వాలిటీ సరిగా లేనందువల్లే తగ్గిస్తున్నామని వ్యాపారులు సమాధానం చెప్తున్నారని, ఉదయం ఉన్న క్వాలిటీ మధ్యాహ్నానికే ఎలా తగ్గుతుందని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ నుంచి మిరప ఎగుమతులు ఎక్కువగా చైనా, కొలంబో, బంగ్లాదేశ్, ఇండోనేషియాకు సాగుతాయని ఎగుమతి దారులు వివరించారు. అయితే ఈ యేడాది ఆయా దేశాలకు ఎగుమతులు తగ్గడం వల్ల రాష్ట్రంలో మిర్చికి కొంత ధర తగ్గిందని అన్నారు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌లో వచ్చిన వరదల కారణంగా, పురుగు మందులు ఎక్కువగా వినియోగించడం వల్ల, క్వాలిటీ కొంత దెబ్బతినడం వల్ల డిమాండ్ తగ్గుతుందని వివరించారు.
Also Read : Sanam Shetty Shocking Comment :పడుకుంటేనే ఛాన్స్ లు ఇస్తామంటే ఎలా..?