Anushka Shetty : చాన్నాళ్లకు వెండితెరపై కనిపించనున్న స్వీటీ

గురువారం(నవంబర్ 7) అనుష్క పుట్టినరోజు కావడంతో....

Hello Telugu - Anushka Shetty

Anushka Shetty : స్వీటీ అనుష్క శెట్టి దర్శనమిచ్చింది. ఆమె దర్శనం కోసం అభిమానులు ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నారు. అసలామే ఏ సినిమా చేస్తుందో కూడా తెలియనంతగా ఇన్నాళ్లుగా నిశ్శబ్దాన్ని పాటించారు. ఇప్పుడామె రెండు సినిమాలలో చేస్తున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అందులో ఒక చిత్రం ‘ఘాటి(Ghaati)’. ‘వేదం’ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో ఎక్సయిటింగ్ న్యూ ప్రాజెక్ట్ ‘ఘాటి’ కోసం మరోసారి అనుష్క కొలాబరేట్ అయ్యారు. UV క్రియేషన్స్ సమర్పణలో.. రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తుండగా.. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై అనుష్కకు ఇది నాలుగో సినిమా కావడం విశేషం.

Anushka Shetty Movie Updates

గురువారం(నవంబర్ 7) అనుష్క పుట్టినరోజు కావడంతో.. ఆమె బర్త్‌డేను సెలబ్రేట్ చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేశారు. ఫస్ట్ లుక్ అనుష్క పాత్ర యొక్క స్టన్నింగ్ అండ్ రూత్ లెస్ అవతార్‌ను ప్రజెంట్ చేస్తోంది. ఈ పోస్టర్‌లో అనుష్క(Anushka Shetty) తల, చేతుల నుండి రక్తం కారుతున్నట్లు కనిపిస్తోంది. ఆమె నుదిటిపై బిందీతో, బంగా స్మోక్ చేస్తూ కనిపించడం స్టన్నింగ్‌గా వుంది. కన్నీటి కళ్ళు, నోస్ రింగ్స్, ఆమె పాత్ర ఇంటెన్స్‌ని తెలియజేస్తూ.. పాత్రపై, అలాగే సినిమాపై క్యురియాసిటీని పెంచేస్తున్నాయి.

ఈపోస్టర్‌లోని ప్రతి ఎలిమెంట్ కథానాయిక జీవితంలోని కఠినమైన కోణాలను లోతుగా అన్వేషించే ఇంటెన్స్ ఫిల్మ్‌ని సూచిస్తున్నాయి. బ్లడ్ షేడ్స్, ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్, మనుగడ, పోరాటాన్ని అద్భుతంగా చూపిస్తున్నాయి. పోస్టర్ ఎమోషనలీ చార్జ్డ్, ఇంటెన్స్ జర్నీకి టోన్‌ని సెట్ చేస్తుంది. విక్టిమ్, క్రిమినల్, లెజెండ్ అనే ట్యాగ్‌లైన్‌తో, ‘ఘాటి’ విలక్షణమైన కథనం; మానవత్వం, మనుగడ, విముక్తి అన్వేషణగా వుంటుందని, క్రిష్ డైరెక్షన్, ఇంటెన్స్ విజువల్ సెట్టింగ్ ప్రేక్షకులకు గ్రిప్పింగ్, విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఇది కేవలం ఒప్పు, తప్పు గురించి మాత్రమే కాదు, నిజమైన లెజెండ్స్ పుట్టే గ్రే ఏరియాల స్టోరీ అనే మేకర్స్ చెబుతున్న తీరు చూస్తుంటే.. ఖచ్చితంగా అనుష్క ఈ సినిమాతో మరో బ్లాక్‌బస్టర్ కొట్టబోతుందనేది అర్థమవుతోంది. గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్ర ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Also Read : Janhvi Kapoor : సడన్ గా హైదరాబాద్ హనుమాన్ టెంపుల్ లో దర్శనమిచ్చిన జాన్వీ

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com