Anushka Shetty : నటి అనుష్క శెట్టి షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు డార్లింగ్ ప్రభాస్ కు మధ్య స్నేహం ఉందని స్పష్టం చేశారు. ఇద్దరూ కలిసి పలు సినిమాలలో చేశారు. ప్రత్యేకించి దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలిలో నటించారు. ఆ తర్వాత కొంత గ్యాప్ ఏర్పడింది.
Anushka Shetty Comments Viral
తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ నవీన్ పోలిశెట్టితో కలిసి నటించింది. ప్రస్తుతం ఆ సినిమా కూడా మంచి ఆదరణ పొందుతోంది. బుధవారం అనుష్క శెట్టి ఓ కార్యక్రమంలో తళుక్కున మెరిసింది. ఈ సందర్బంగా ప్రభాస్ తో ఎప్పుడు నటిస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు .
దీంతో అందాల ముద్దుగుమ్మ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. సరైన సమయం రావాలి. ఇదే సమయంలో ఏది పడితే ఆ సినిమా తాను చేయనని స్పష్టం చేశారు అనుష్క శెట్టి(Anushka Shetty). గతంలో తాను డార్లింగ్ ప్రభాస్ కలిసి నటించిన ప్రతి మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచిందన్నారు. మంచి స్క్రిప్ట్ (కథ) ఇప్పటి వరకు రాలేదన్నారు.
ఇద్దరం మంచి ఫ్రెండ్స్ గా ఉన్నాం. మా మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంది. ఇద్దరం కూడా కథ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పారు అనుష్క శెట్టి. తాను అతడితో కలిసి పని చేసేందుకు ఇష్ట పడతానని అన్నారు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా సినిమా చేస్తానని స్పష్టం చేశారు లవ్లీ బ్యూటీ.
Also Read : Rajinikanth Laal Salaam : మొయితీన్ భాయ్ వారెవ్వా