Anushka Shetty : మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి మూవీ సక్సెస్ కావడంతో ఫుల్ ఖుషీలో ఉన్నారు నటీ నటులు నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి. సెప్టెంబర్ 7న ఈ చిత్రం విడుదలైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది.
Anushka Shetty Feels Good
వినోదం, హాస్యం ఉండేలా జాగ్రత్త పడ్డారు దర్శకుడు. తాజాగా మూవీని ఆదరించినందుకు థ్యాంక్స్ తెలిపారు నటి అనుష్క శెట్టి(Anushka Shetty). మీ అందరి ప్రేమ, ప్రతిస్పందన చూస్తుంటే హృదయం ఆనందంగా ఉందన్నారు.
ఆసక్తికర ప్రకటన చేశారు నటి. సినిమాను విజయవంతం చేసినందుకు గాను మహిళలకు తీపి కబురు చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మహిళలకు ప్రత్యేకంగా ఉదయం మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు అనుష్క శెట్టి.
ఇప్పటికే ప్రతి చోటా కలెక్షన్స్ కొల్లగొడుతూ దూసుకు పోతోంది. ప్రతి చోటా ఆదరణ చూరగొంటోంది మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి చిత్రం. ఇది ఊహించని సక్సెస్ దక్కడంతో చిత్ర యూనిట్ తెగ ముచ్చట పడుతున్నారు. సంబురాలు చేసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా అనుష్క శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డార్లింగ్ ప్రభాస్ తో తప్పకుండా మరో సినిమా చేస్తానని చెప్పారు.
Also Read : Sakshi Vaidya Vs Daksha Nagarkar