Anurag Kashyap : బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్(Anurag Kashyap). తను సమాజాన్ని ప్రభావితం చేసే అంశాలను ప్రాతిపదికన తీసుకుని సినిమాలు తీశాడు. విచిత్రం తను ఏక్ ప్రేమ్ కథ మూవీలో నటిస్తుండడం విశేషం. ఇది ద్విభాషా యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది.
Anurag Kashyap as a Police Officer Role
ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రానుంది. ప్రఖ్యాత దర్శకుడు ఇందులో ఓ శక్తివంతమైన పాత్రలో చేరడం విశేషం. అవినీతిని సహించని నిష్కపటమైన అయ్యప్ప భక్తుడైన నిర్భయ ఇన్స్ పెక్టర్ గా నటించాడు.
యాక్షన్, భావోద్వేగం, నాటకీయతతో కూడిన ఆకర్షణీయమైన పాత్ర తనది కావడం విశేషం. ఈ సినిమాకు సంబంధించి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. డెకాయిట్ – ఏక్ ప్రేమ్ కథ విషయానికి వస్తే తన మాజీ ప్రియురాలిపై ప్రతీకారం తీర్చుకునేందుకు కోపంగా ఉన్న దోషి ప్రయాణాన్ని అనుసరిస్తుంది.
ఈ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అనురాగ్ కశ్యప్. ఈ చిత్రంలో తాను నటిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నాడు. ప్రత్యేకించి పోలీస్ ఆఫీసర్ పాత్రలో లీనం కావడం మరింత ఆసక్తిని కలిగించేలా ఉందన్నాడు.
ఇదిలా ఉండగా ఈ చిత్రం హిందీతో పాటు తెలుగులో కూడా వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలు తీసిన తాను నటుడిగా తెర పైకి రావడం ఆశ్చర్యానికి లోను చేస్తుందన్నాడు అనురాగ్ కశ్యప్.