Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్‌ ‘పరదా’ టైటిల్ రిలీజ్ !

అనుపమ పరమేశ్వరన్‌ 'పరదా' టైటిల్ రిలీజ్ !

Hello Telugu - Anupama Parameswaran

Anupama Parameswaran: ‘టిల్లు స్క్వేర్‌’ తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran)… బోల్డ్ సీన్లకు కూడా సై అంటూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇప్పుడు ‘పరదా’ అనే మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ‘సినిమా బండి’ దర్శకుడు ప్రవీణ్‌ కండ్రేగులతో దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ టీజర్‌ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

Anupama Parameswaran Movies

ఆనంద మీడియా బ్యానర్‌ పై విజయ్ డొంకాడ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా సరికొత్తగా అనిపిస్తుందని అనుపమ చెబుతుంది. ఇప్పటి వరకు ఎక్కడా చూడని కథతో వస్తున్నామని ఆమె చెప్పింది. మలయాళ నటి దర్శన రాజేంద్రన్‌ తో పాటు సంగీత, రాగ్‌ మయూర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వాస్తవంగా ఈ ప్రాజెక్ట్‌లో సమంత నటించాల్సింది. కానీ ఆమె ఆరోగ్యం సహకరించకపోవడంతో అనుపమకు ఈ ఛాన్స్‌ దక్కినట్లు తెలుస్తోంది.

‘అఆ’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి… ‘శతమానం భవతి’, ‘కార్తికేయ 2’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల మదిలో మంచి ముద్ర వేసుకున్న అనుపమ… దిల్‌రాజు వారసుడు ఆశిష్‌ హీరోగా చేసిన ‘రౌడీ బాయ్స్’లో లిప్ కిస్ సీన్స్‌లో నటించి అందరూ అవాక్కయ్యేలా చేసింది. తాజాగా ‘డీజీ టిల్లు’ సీక్వెల్‌ గా తెరకెక్కించిన ‘టిల్లు స్క్వేర్‌’ లో కాస్తంత బోల్డుగానే నటించింది. ఇకపై మరింత బోల్డ్ తరహా పాత్రలతో పాటు బెడ్ రూమ్ సీన్స్‌ అయినా సరే నటించడానికి అనుపమ సిద్ధమైపోయిందని టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న చర్చ.

Also Read : Kiara Advani: ప్రభాస్‌ సరసన కియారా అద్వానీ ?

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com