Anshu Ambani : ధమాకా ఫేం త్రినాథరావు దర్శకత్వంలో మజాకా మూవీ వస్తోంది. ఇందులో సందీప్ కిషన్ , రీతూ వర్మ తో పాటు రావు రమేష్, మన్మథుడు మూవీ హీరోయిన్ అన్షు నటిస్తున్నారు. తాజాగా మన్మథుడు హీరోయిన్ అన్షు(Anshu Ambani) పుట్టిన రోజు కావడంతో మూవీ మేకర్స్ ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. తనను పెళ్లి కూతురి గెటప్ లో ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇది నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక త్రినాథరావు తనదైన స్టైల్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేశారు.
Anshu Ambani New Look
మజాకా మూవీకి సంబంధించిన పాటలు, పోస్టర్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. దీంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా లాంగ్ గ్యాప్ తర్వాత అన్షు తిరిగి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం తనకు వెరీ స్పెషల్ అని పేర్కొంది ఈ నటి.
అంతే కాదు అందమైన గాగుల్స్ పెట్టుకుని మరీ ఆకట్టుకునేలా ఉంది అన్షు. తన లుక్ మాత్రం వెరీ వెరీ స్పెషల్ గా ఉందంటున్నారు నెటిజన్స్. ఊర మాస్ గా చిత్రీకరించారని, కుర్రకారును వెర్రెక్కించడం ఖాయమని అంటున్నారు దర్శకుడు త్రినాథరావు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ కలిసి మజాకాను నిర్మిస్తున్నాయి. ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ చిత్రం.
Also Read : Swara Bhaskar-Twitter Shocking : పిట్ట కూతపై స్వర భాస్కర్ ఫైర్