ANR National Award: మెగాస్టార్, పద్మ విభూషణ్ చిరంజీవి మరో ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నారు. 2024 సంవత్సరానికి సంబంధించి అక్కినేని నాగేశ్వరరావు అవార్డును అందుకోబోతున్నారు. ఇదే విషయాన్ని అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడు, టాలీవుడ్ కింగ్ నాగార్జున స్వయంగా ప్రకటించారు. అక్కినేని నాగేశ్వరరావు(ANR) శత జయంతిని పురస్కరించుకుని శుక్రవారం హైదరాబాద్‌లో 100వ పుట్టినరోజు వేడుకలను అక్కినేని ఫ్యామిలీ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నాగచైతన్య మినహా అక్కినేని కుటుంబం మొత్తం హాజరైంది. ఈ కార్యక్రమంలో ఈ ఏడాది ఏఎన్నార్ అవార్డ్ ను మెగాస్టార్ చిరంజీవికి ఇవ్వబోతున్నాట్లు కింగ్ నాగార్జున అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 28నజగరబోయే ఈ ఫంక్షన్ లో బిగ్ బి అమితాబ్ చేతుల మీదుగా ఈ అవార్డును ఇవ్వబోతున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ సందర్భంగా బాపుగారు గీసిన ఏఎన్నార్ చిత్రాన్ని పోస్టల్ స్టాంప్ రూపంలో విడుదల చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని కింగ్ నాగ్ తెలిపారు.
ANR National Award…
ఈ కార్యక్రమంలో కింగ్ నాగార్జున మాట్లాడుతూ… ‘‘మా నాన్న అంటే మాకు ఎంతో ప్రేమ. నాన్న మాకు నవ్వుతూ జీవించటం నేర్పించారు. ఈ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాలు తెలియజేస్తున్నాను. చాలా దూరం నుంచి విజయ చాముండేశ్వరి వంటి వారెందరో వచ్చారు. వారందరికీ థ్యాంక్యూ. 31 సిటీస్ లో 60కి పైగా థియేటర్స్‌లో నాన్నగారి సినిమాలు ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమాలన్నింటినీ ఉచితంగా చూడవచ్చు. ఈ వేదికపై నాన్నగారి స్టాంప్ రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు. నాన్నగారి అభిమానులు శతజయంతిని చాలాగొప్పగా సెలబ్రేట్ చేశారు. ఈ ఏడాది ఏఎన్నార్ అవార్డ్‌ను మెగాస్టార్ చిరంజీవి గారికి అక్టోబర్ 28న బిగ్ బి అమితాబ్‌గారి చేతుల మీదుగా ప్రధానం చేయనున్నాము’’ అని తెలిపారు.
బాపుగారు గీసిన చిత్రాన్ని పోస్టల్ స్టాంప్ రూపంలో రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు వెంకట్ అక్కినేని. ఇదే కార్యక్రమంలో సీనియర్ నటుడు మురళీ మోహన్ మాట్లాడుతూ.. ‘‘నేను చిన్నప్పటి నుంచి అక్కినేనిగారి అభిమానిని. అలాంటిది అక్కినేని(ANR)గారి పక్కన నటించే అవకాశం నాకు లభించింది. అన్నపూర్ణ స్టూడియోస్ పై తెరకెక్కిన మొదటి సినిమాలో నేనే హీరో. ఇండస్ట్రీలో శ్రీరామచంద్రుడు నేనే అని అక్కినేని సర్టిఫికేట్ ఇచ్చారు. అంతకంటే ఇంకేం కావాలి. హైదరాబాద్‌లో సినీ ఇండస్ట్రీని డెవలప్ చేసిన తొలి వ్యక్తి అక్కినేని..’’ అని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.
Also Read : Hyper Aadi : వరద బాధితులకు తన వంతు విరాళం అందించిన హైపర్ ఆది