Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్… వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆయన ఫాలోయింగ్ కూడా మరింత పెరిగిపోతుంది. డిసెంబర్ వచ్చిందంటే చాలు, ఆయన అభిమానులు అనేక అప్డేట్స్ కోసం ఎదురు చూస్తారు. ఈసారి కూడా ఆయన అభిమానులను నిరాశపరచకుండా సూపర్ అప్డేట్స్‌తో అలరిస్తారు. ఈ డిసెంబర్‌లో రజినీ(Rajinikanth) సూపర్ డబుల్ అప్డేట్స్‌తో ప్రేక్షకులను ఉత్సాహపరుస్తున్నారు.
Rajinikanth Movies Update
ఇటీవలి కాలంలో రిలీజైన ‘వేట్టయాన్’ సినిమా కాస్త నిరాశపరిచినప్పటికీ, ఆయన అత్యుత్తమ దర్శకులతో జతకట్టి, మరింత స్ట్రాంగ్ లైనప్‌తో ముందుకు వెళ్ళిపోతున్నారు. మొదటి అప్డేట్‌గా, ‘విక్రమ్’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీ(Rajinikanth) ‘కూలి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఆపై, రజినీ కెరీర్లో భారీ హిట్ అందించిన ‘జైలర్’ చిత్రం డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్ 2’ సినిమా రూపొందుతోంది.
ఈ రెండు సినిమాలూ ప్రేక్షకుల మధ్య భారీ అంచనాలు కలిగిస్తున్నాయి. ఇప్పటికే ‘కూలి’ సినిమా గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది, ఇక డిసెంబర్ 12న మరో వీడియోను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు, ‘జైలర్ 2’ సినిమా గురించి కీలక అప్డేట్‌ను రజినీ బర్త్‌డే రోజున విడుదల చేయనున్నారు.
‘కూలి’ చిత్రంలో రజినీ సరసన తెలుగు స్టార్ నాగార్జున, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, తమిళ యువ హీరో శివ కార్తికేయన్, అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ ‘ఆమీర్ ఖాన్’ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు కనగరాజ్ దర్శకత్వం, అనిరుధ్ సంగీతం అనేది మరో విశేషం. ఇప్పుడు ఈ సినిమాలన్నీ ప్రపంచవ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్‌గా మారాయి, ఎందుకంటే దక్షిణ భారత స్టార్స్ అందరూ ఒకే ప్రాజెక్టులో కలిసి నటిస్తున్నాయి.
Also Read : Sanjay Gupta-Vikrant : విక్రాంత్ మాస్సే నిర్ణయాన్ని విమర్శించవద్దు