Anjali: అనవసరంగా బాలయ్య ఇష్యూని పెద్దది చేసారంటున్న అంజలి !

అనవసరంగా బాలయ్య ఇష్యూని పెద్దది చేసారంటున్న అంజలి !

Hello Telugu - Anjali

Anjali: ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌ కు ముఖ్య అతిథిగా హాజరైన నందమూరి బాలకృష్ణ వేదికపై వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. వేదికపై ఉన్న సమయంలో ప్రముఖ నటి అంజలిని బాలయ్య ప్రక్కకు త్రోయడంపై సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై నటి అంజలి స్పందించింది. ఒక చిన్న సంఘటనపై అనవసర రాద్ధాంతం చేశారు. ఆ స్టేజీ మీద ఏం జరిగిందనే విషయం మాకు తెలుసు.. దానిపై అంత అతి చేయాల్సిన అవసరం లేదని అన్నారు నటి అంజలి. తాజాగా ఆమె నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రం విడుదలై… సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా అంజలి మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

Anjali Comment

సోషల్ మీడియా గురించి, రీసెంట్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ వేడుక లో జరిగిన సంఘటన గురించి అంజలి(Anjali) మాట్లాడుతూ… ‘‘నేను సోషల్‌ మీడియా ఫాలో అవుతాను. అయితే దీన్ని ఒక సాధనంగా మాత్రమే చూస్తాను. నా ప్రేక్షకులకు నేను చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పటానికి మాత్రమే వాడతాను. ఏదో ఒక విషయం చెప్పి… దానిపై వివాదం వస్తే… దాన్ని విశ్లేషించడం, మళ్లీ వివరణ ఇవ్వడం.. ఇలా ఉపయోగించను. నా ఉద్దేశంలో కరెక్ట్‌గా వాడే వారికి మంచిదే. అదే జీవితమనుకొని.. నెగిటివిటీని వ్యాపింపచేయటం మాత్రం సరైనది కాదు. చాలా సందర్భాలలో మొత్తం స్టోరీ చెబితే తప్ప- అసలు విషయం మనకు అర్థం కాదు.

చిన్న ఇష్యూని అనవసరంగా పెద్దది చేశారు !

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌లో ఒక చిన్న సంఘటనపై అనవసర రాద్ధాంతం చేశారు. ఆ స్టేజీ మీద ఏం జరిగిందనే విషయం మాకు తెలుసు. బాలయ్య నన్ను కొద్దిగా జరగమని నెట్టారు. నేను వెంటనే నవ్వేశాను. దాన్ని సోషల్‌ మీడియాలో అనవసరంగా పెద్దది చేశారు. బాలయ్య నాకు ‘డిక్టేటర్‌’ సినిమా నుంచి తెలుసు. ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో కూడా ఆయన… ‘నాకూ, అంజలికి ఎనర్జీ మ్యాచ్‌ అవుతుంది. మా భావాలు మొహంలో తెలిసిపోతాయు’ అన్నారు కూడా! ఇది చాలా చిన్న సంఘటన. సోషల్‌ మీడియాలో అనవసరపు సంఘటనలు ఎలా వైరల్‌ అవుతాయో చెప్పటానికి ఇదొక ఉదాహరణ..’’ అని చెప్పుకొచ్చారు.

Also Read : Nivetha Pethuraj: ఆశక్తికరంగా నివేథా పేతురాజ్‌ వెబ్‌ సిరీస్‌ ‘పరువు’ ట్రైలర్‌ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com