ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన లియో చిత్రం ట్రైలర్ అశేష అభిమానుల సందోహం మధ్య విడుదలైంది. ఓ వైపు భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా తమ అభిమాన నటుడు తళపతి జోసెఫ్ విజయ్ కోసం పరుగులు తీశారు.
మరో వైపు వరుస సినిమాలకు సంగీతం అందిస్తూ టాప్ లో కొనసాగుతున్నాడు అనిరుధ్ రవిచందర్. ఇండియన్ రాక్ స్టార్ గా ఇప్పటికే గుర్తింపు పొందాడు. విజయ్ బీస్ట్ కు తనే సంగీతం అందించాడు. ఇక లోకేష్ కనగరాజ్ మాస్టర్ తీశాడు జోసెఫ్ తో. అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ప్రస్తుతం లియోకు దర్శకత్వం వహించాడు. విజయ్ తో పాటు త్రిష కృష్ణన్ , సంజయత్ దత్ ప్రధాన పాత్రల్లో నటించారు. అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ థీమ్ తో పాటు సాంగ్స్ కెవ్వు కేక పుట్టించేలా ఉన్నాయి. తను ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ మూవీకి కూడా సంగీతం అందించాడు అనిరుధ్.
ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ , విజయ్ , అనిరుధ్ కు సంబంధించిన చిత్రాలు వైరల్ గా మారాయి నెట్టింట్లో.