తమిళ సినీ రంగంలో ఇప్పుడు ఒకే ఒక్కడి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అతడు హీరో అనుకుంటే పొరపాటు పడినట్లే. గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిరుధ్ రవిచందర్. కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు దర్శక, నిర్మాతలు వెయిట్ చేస్తున్నారంటే అతడి వాల్యూ ఈపాటికే అర్థమై ఉంటుంది.
ప్రతి దర్శకుడు ఏరికోరి ఏఆర్ రెహమాన్ ను కాదని అనిరుధ్ కావాలని కోరుకుంటున్నారు. తాజాగా తను బ్లాక్ బస్టర్ సినిమాలకు మ్యూజిక్ ఇచ్చాడు. ఈ ఏడాది అన్నీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. మరికొన్ని కొత్త సినిమాలకు సైన్ చేశాడు.
తలైవా రజనీకాంత్ నటించిన జైలర్ బిగ్ సక్సెస్. దీనికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. ఈ మూవీ రూ. 650 కోట్లకు పైగా వసూలు చేసింది. మరో వైపు డైనమిక్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జవాన్ హిందీ మూవీకి సైతం మనోడు మ్యూజిక్ ఇచ్చాడు. ఇది ఏకంగా రూ. 1,000 కోట్లకు దగ్గరగా వచ్చింది.
ఇది కూడా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. తలైవా మరో కొత్త మూవీకి ఫిక్స్ అయ్యాడు. ముందస్తు చెక్ ఇచ్చాడు సన్ పిక్చర్స్ చీఫ్. కమల్ నటిస్తున్న ఇండియన్ 2 కు కూడా తనే మ్యూజిక్ డైరెక్టర్. ఇక తాజాగా రిలీజ్ కాబోయే లియో మూవీకి సంగీతం ఇచ్చాడు. అజిత్ నటిస్తున్న విదా ముయార్చి, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర, విఘ్నేష్ శివన్ , ప్రదీప్ , శివ కార్తికేయన్ , ఏఆర్ఎం, కవిన్ సతీష్ ప్రాజెక్టు కు కూడా అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ఇస్తుండడం విశేషం.