Bobby Deol : బాలీవుడ్ లో రామాయణం ఆధారంగా సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో చాలా మంది నటీనటులు కనిపించనున్నారు. యష్, రణబీర్ కపూర్, సాయి పల్లవి ఇలా అనేక ఇతర పెద్ద తారలు ‘రామాయణం’లో నటిస్తున్నారు. ఇప్పటివరకు భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. విశేషమేమిటంటే ఈ సినిమాలో నటుడు యష్ కూడా పెట్టుబడి పెట్టాడు. మాన్స్టర్ మైండ్స్ నిర్మాణ సంస్థ ‘రామాయణం’ చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్(Bobby Deol) ఈ చిత్రంలో నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను బాబీ డియోల్(Bobby Deol) టీమ్ క్లారిటీ ఇచ్చింది. తాజాగా బాబీ డియోల్ స్వయంగా ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా సినిమాకి సంబంధించిన ఓ సీక్రెట్‌ను బయటపెట్టాడు బాబీ డియోల్.
Bobby Deol Movie Updates
‘రామాయణం’సినిమా షూటింగ్ చాలా రహస్యంగా జరుగుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. ఈ సినిమాలో యష్ రావణుడి పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా యష్ హాలీవుడ్ రిపోర్టర్ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. కాగా ఈ సినిమాలో బాబీ డియోల్ కుంభకర్ణుడిగా మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. దీని గురించి బాబీ డియోల్ మాట్లాడుతూ..
‘రామాయణంచాలా పెద్ద ప్రాజెక్ట్, హాలీవుడ్ ‘అవతార్’, ‘ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ లాంటి ఎక్స్పీరియన్స్ కలుగుతుందని అన్నారు.సినిమాలో చాలా సాంకేతిక అంశాలు ఉన్నాయి. సినిమా ఎలా రావాలి, పాత్రలు ఎలా కనిపించాలి అనే విషయాల్లో సినిమాటోగ్రాఫర్లు, టెక్నీషియన్లు, దర్శకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని బాబీ డియోల్ అన్నారు.రామాయణం సినిమాలో బాబీ డియోల్ కుంభకర్ణుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ముంబైలోని కెసి కాలేజీలో నిర్మించిన ప్రత్యేక ఆడిటోరియంలో బాబీ స్క్రీన్ టెస్ట్ జరిగింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని బాబీ డియోల్ అన్నారు.సినిమా చూస్తుంటే ఇదంతా నిజంగానే కళ్ల ముందు జరుగుతున్నాయా అనే ఫీలింగ్ వచ్చేలా టెక్నాలజీని ఉపయోగించాం, ఇది అద్భుతమైన సినిమా అవుతుంది. అందరికీ నచ్చుతుంది’ అని బాబీ డియోల్ అన్నారు.
Also Read : Ramayan Movie : ‘రామాయణ’ సినిమాలో మరో బాలీవుడ్ అగ్రనటుడు