Animal : అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగా దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్, రష్మిక హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘యానిమల్’. టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్ సంయుక్తంగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 1న విడుదల కానుంది. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకుని ‘A’ సర్టిఫికెట్ పొందిన ‘యానిమల్(Animal)’ సినిమాకు సంబంధించి… దర్శకుడు సందీప్ వంగా సినిమా కీలకమైన విషయాన్ని వెల్లడించారు.
భారీ బడ్జెట్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా నిడివి (రన్ టైం) 3 గంటల 21 నిమిషాల 23 సెకన్లు & 16 ఫ్రేమ్స్’’ అంటూ సందీప్ తెలిపారు. దీనితో ‘యానిమల్(Animal)’ సినిమా రన్ టైం పై అటు నెటిజన్లతో పాటు సినీ వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఇంత ఎక్కువ డ్యూరేషన్ తో వస్తున్న సినిమాను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారు అనే అనుమానాలు కొంతమంది నుండి వ్యక్త మౌతున్నాయి.
Animal – ధోనీ తరువాత అతి ఎక్కువ నిడివి గల చిత్రంగా ‘యానిమల్’
గతంలో భారీ నిడివిగల చిత్రాలకు ఆదరణ ఉండేది. ఈ నేపథ్యంలోనే మెహబత్తేన్, కభీ అల్విద న కెహనా, లగాన్, జోదా అక్బర్, దాన వీర శూర కర్ణ, లవకుశ, సంపూర్ణ రామాయణం వంటి భారీ నిడివిగల చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. అయితే భారీ నిడివిగల చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాలంటే కథ, కథనం, పాటలు, యాక్షన్ సీన్లతో కలిపి దర్శకుడి అసమాన ప్రతిభ అవసరం.
ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో భారీ నిడివిగల చిత్రాల సంఖ్య బాగా తగ్గిపోయింది. రెండు గంటల నిడివికి పైగా సినిమాను థియేటర్ల లో రిలీజ్ చేయడం అంటే… అటు దర్శకులతో పాటు నిర్మాతలకు కూడా కత్తిమీద సాముగా మారింది. దీనితో(Dhoni) ఇటీవల కాలంలో విడుదలైన చిత్రాల్లో అత్యధిక నిడివి ఉన్న బాలీవుడ్ చిత్రం ‘యానిమల్’ గా నిలుస్తోంది. 2016లో విడుదలైన ‘ధోనీ’ సినిమా రన్‌టైన్ 3.10 గంటలు. ‘ధోనీ’ సినిమా రికార్డును బద్దలగొడుతూ ఈ సినిమా ఏకంగా 3.21 నిమిషాలకు పైగా రన్ టైంతో విడుదల చేస్తున్నారు.
రన్ టైంలో కాంప్రమైజ్ కాని సందీప్ వంగా
టెస్టుల నుండి వన్డేలకు… వన్డేల నుండి T20లకు మొగ్గుచూపుతున్న ఈ రోజుల్లో మూడు గంటలకు పైగా రన్ టైంతో సినిమా రిలీజ్ చేయడం అంటే నిజంగా సాహసమే అని చెప్పాలి. దర్శకుడు అనుకున్నట్లు జరిగితే ఫరవాలేదు… కాని ఏ మాత్రం తేడా జరిగినా మూడు గంటల పాటు ప్రేక్షకుడు థియేటర్ లో కూర్చోవడం అసాథ్యం. ఈ నేపథ్యంలోనే బాహుబలి, కేజిఎఫ్, పుష్ప లాంటి సినిమాలను కూడా ఒకే సినిమాగా తీయాలనుకున్నప్పటికీ సినిమా రన్ టైం పెరగడంతో పాటు బడ్జెట్ పెరగడంతో పార్టులుగా విడదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే సందీప్ వంగా మాత్రం కథపై నమ్మకంతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. గతంలో అర్జున్ రెడ్డి కూడా మూడు గంటల సినిమాయే. అయితే అదే సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’ గా తెరకెక్కించినప్పుడు కాస్త నిడివి తగ్గించార. అయితే ఈ యానిమల్ సినిమా విషయంలో కూడా సందీప్ వంగా వెనక్కి తగ్గకుండా డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నారు.
Also Read : Salman Khan: జర్నలిస్టుకు ముద్దుపెట్టిన సల్మాన్ ఖాన్…