Animal Satranga Song : అర్జీత్ వాయిస్ అదుర్స్

యానిమ‌ల్ మూవీ సెకండ్ సాంగ్ రిలీజ్

టాలీవుడ్ డైరెక్ట‌ర్ వంగా సందీప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం యానిమ‌ల్. గ‌తంలో మ‌నోడు అర్జున్ రెడ్డి తీశాడు. దీనిని హిందీలో షాహిద్ క‌పూర్ తో తీశాడు. ఇక హిందీలో స్ట్రెయిట్ సినిమాను ఫ్రేమ్ చేశాడు. త‌నే క‌థ , ద‌ర్శ‌క‌త్వం అన్న‌మాట‌.

ఇప్ప‌టికే సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన పోస్ట‌ర్స్, టీజ‌ర్ , సాంగ్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. ఇందులో ర‌ణ్ బీర్ క‌పూర్ , నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా పోటీ ప‌డి న‌టించారు. ఇక వెరైటీ గా ముద్దు సీన్ క్రియేట్ చేశాడు వంగా సందీప్ రెడ్డి.

ముద్దుల హద్దుల్ని చెరిపేసింది ర‌ష్మిక‌. తాజాగా యానిమ‌ల్ సినిమాకు సంబంధించి మూవీ మేక‌ర్స్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రెండో సాంగ్ ను విడుద‌ల చేశారు. ఇప్ప‌టికే సినీ రంగానికి సంబంధించి టాప్ సింగ‌ర్స్ ల‌లో ఒక‌డిగా గుర్తింపు పొందాడు అర్జీత్ సింగ్.

సంత్రాంగా పేరుతో పాడిన పాట‌కు ప్రాణం పోషాడు మ‌నోడు. చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు డైరెక్ట‌ర్. ర‌ణ బీర్ క‌పూర్ తో పాటు మ‌రీ న‌ట దిగ్గ‌జం అనిల్ క‌పూర్ కూడా న‌టిస్తుండ‌డం విశేషం. మొత్తంగా సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com