Animal Movie : టాలీవుడ్ లో ఒకే ఒక్క సినిమా తీశాడు వంగా సందీప్ రెడ్డి(Sandeep Reddy Vanga). అదే విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి మూవీ. కుర్రకారుకు కిర్రాక్ తెప్పించేలా చేశాడు. ఇందులో ముద్దులు హద్దులు దాటాయి. బాక్సులు వసూళ్లతో బద్దలయ్యాయి. ఇంకేం మనోడికి ఎక్కడ లేని డిమాండ్ ఏర్పడింది. అది కాస్తా దానినే బాలీవుడ్ లో షాహీద్ కపూర్ తో తీశాడు ఇది సూపర్ సక్సెస్. ఇంకేం బాలీవుడ్ నిర్మాతల కళ్లన్నీ వంగాపై పడ్డాయి.
Animal Movie Updates
తన కళ్లల్లో రణ బీర్ కనబడ్డాడు. ఇప్పటికే పుష్ప ది రైజ్ తో నేషనల్ క్రష్ గా మారిన నటి రష్మిక మందన్నా తో కలిసి యానిమల్ ప్లాన్ చేశాడు. అది ఎవరూ ఊహించని రీతిలో తెరకెక్కించే ప్రయత్నం చేశాడు.
గతంలో దర్శకులు ముద్దులను తమకు నచ్చినట్టు తీసే వారు. కానీ స్పెషల్ గా వంగా సందీప్ రెడ్డి ఓ సాంగ్ లోనే అన్నింటిని కిస్ లకు ప్రయారిటీ ఇచ్చాడు. విచిత్రం ఏమిటంటే ఫ్లైయిట్ లో పైలట్ పాత్రల్లో రణ్ బీర్ కపూర్ , రష్మిక మందన్నా కలిసి ముద్దు పెట్టుకోవడం సెన్సేషన్ గా మారింది.
యానిమల్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు రూ. 100 కోట్లకు పైగా ఖర్చు పెట్టి యానిమల్ తీశాడు వంగా. అయితే ఇంకా రిలీజ్ కాకుండానే భారీ ఎత్తున డబ్బులు పెట్టేందుకు క్యూ కడుతున్నట్లు టాక్. దటీజ్ వంగా ఎంతైనా మనోడు కదూ.
Also Read : Mrunal Thakur : దానిపై అంత ఆసక్తి లేదు