టాలీవుడ్ కు చెందిన వంగా సందీప్ రెడ్డి మరోసారి హాట్ టాపిక్ గా మారాడు. తను విజయ్ దేవరకొండతో తీసిన మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో హెవీ డిమాండ్ పెరిగింది. తాజాగా రణబీర్ కపూర్ తో యానిమల్ పేరుతో మూవీ తీస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ శర వేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎలాగైనా సరే రికార్డులను తిరగ రాయలని ఫుల్ ఫోకస్ పెట్టాడు దర్శకుడు వంగా సందీప్ రెడ్డి. యానిమల్ కు సంబంధించి పోస్టర్ రిలీజ్ చేశారు. దానికి మంచి ఆదరణ లభించింది.
ప్రస్తుతం బాలీవుడ్ కు సంబంధించి పలు సినిమాలు విడుదలయ్యాయి. ఇప్పటి వరకు రిలీజ్ అయిన వాటిలో సన్నీ డియోల్ , అమీషా పటేల్ నటించిన గదర్ -2 రూ. 500 కోట్లను దాటేసింది. ఇక సల్మాన్ ఖాన్ నటించిన జవాన్ రూ. 820 కోట్లను దాటేసింది. రూ. 1,000 కోట్ల క్లబ్ లోకి చేరుకునేందుకు రెడీగా ఉంది.
ఈ తరుణంలో వంగా సందీప్ రెడ్డి తీస్తున్న చిత్రంపై మరింత అంచనాలు పెరిగాయి. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సెప్టెంబర్ 28న యానిమల్ మూవీ టీజర్ విడుదల చేస్తామని ప్రకటించారు మూవీ మేకర్స్.