Animal: అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగా దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్, రష్మిక, బాబీడియోల్, అనిల్ కపూర్, త్రిప్తి డిమ్రి ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన సినిమా ‘యానిమల్’. డిసెంబరు 1న విడుదలైన ఈ యాక్షన్ సినిమా… ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ. 800 కోట్లు కలెక్షన్లు సంపాదించి… రణ్ బీర్ కపూర్ కెరీర్ బెస్ట్ సినిమాగా నిలిచింది. అయితే ఈ సినిమా వసూళ్లపై చిత్ర నిర్మాత ప్రణయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ తమ చిత్రం సుమారు రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందన్నారు. అయితే చిన్న కారణంతో మొదటి వారంలో సుమారు రూ. 40 కోట్ల వరకు నష్టపోవాల్సి వచ్చిందన్నారు. అయితే రూ. 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా… రూ. 800 కోట్లు కలెక్షన్లు చేసిన తరువాత కూడా నిర్మాత రూ. 40 కోట్లు నష్టం వచ్చిందనడంతో అతని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Animal – నిర్మాత ప్రణయ్ ఏమన్నారంటే ?
‘‘యానిమల్(Animal)’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు రూ. 800 కోట్లు వసూలు చేసింది. వసూళ్ల విషయంలో మేము వాస్తవాలనే చెబుతున్నామని అందులో ఎలాంటి దాపరికం లేదన్నారు. ఈ సినిమా ఇంకా రూ.1000 కోట్ల క్లబ్‌లోకి చేరలేదు. అయితే డిస్ట్రిబ్యూటర్స్ చెప్పిన లెక్కల ప్రకారం… మొదటి వారంలో థియేటర్లు దొరక్క దాదాపు రూ.40 కోట్లు నష్టపోయాం. లాంగ్ వీకెండ్ లేకపోవడం, ఎ సర్టిఫికేట్ సినిమా కావడం, 3.21 గంటల నిడివి, అదే సమయంలో ‘సామ్ బహాదుర్’ రిలీజ్ కావడం వలన మేము నష్టపోవాల్సి వచ్చింది. మా సినిమా చూడాలని ప్రేక్షకులకు ఆసక్తి ఉన్నా… అందుబాటులో ఉన్న థియేటర్ లో సినిమా లేకపోవడంతో తొలివారంలో కలెక్షన్స్ కాస్త తక్కువగా వచ్చాయి. నిడివి ఎక్కువగా ఉందని ఎవరూ ఇబ్బందిపడలేదు. కాకపోతే సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ గురించి కొంతమంది కామెంట్ చేశారు.
అయితే విషయం ఏదైనా సరే అందరినీ సంతృప్తి పరచడం వీలుపడదు కాబట్టి… ప్రస్తుతం సందీప్ ‘యానిమల్(Animal)’ ఓటీటీ వెర్షన్ కోసం వర్క్ చేస్తున్నాడు. కొత్త సీన్స్ యాడ్ చేయాలా ? వద్దా ? అనేది ఆలోచిస్తున్నాం. ఎందుకంటే, నెట్‌ఫ్లిక్స్ ఇండియా కొత్త నిబంధనల ప్రకారం… సెన్సార్ పూర్తయ్యాకే తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సినిమా విడుదల చేయాల్సి ఉంటుంది. కొత్త సీన్స్ యాడ్ చేసి మరోసారి సెన్సార్‌కు వెళ్లాలా ? లేదా థియేటర్ వెర్షన్‌లోనే విడుదల చేయాలా ? అనేది చూస్తున్నాం’’ అని ప్రణయ్ తెలిపారు.
Also Read : Big Boss Telugu: బిగ్‌బాస్ నిర్వాహకులకు పోలీసుల నోటీసులు !