Animal: అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, రష్మిక హీరోహీరోయిన్లుగా అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ‘యానిమల్’. టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్ సంయుక్తంగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 1న విడుదల కానుంది. ‘యానిమల్(Animal)’ సినిమా విడుదలకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
Animal – అడ్వాన్స్ బుకింగ్ లో రూ 20.15 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ‘యానిమల్’
అడ్వాన్స్ బుకింగ్ అప్‌డేట్‌ల విషయానికొస్తే యానిమల్ ఇప్పటివరకూ రూ 20.15 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. నిన్న ఈ మొత్తం రూ.14.2 కోట్ల గ్రాస్ ఉండేది. ఒక్కరోజుకే ఈ వసూళ్లు 42% పెరగడం విశేషం. అడ్వాన్స్ బుకింగ్స్‌యే ఈ రేంజ్‌లో ఉంటే ఇక బాక్సాఫీస్ వసూళ్లు ఎలా ఉంటాయోనని అందరూ ఎదరుచూస్తున్నారు.
అడ్వాన్స్ బుకింగ్స్ లో టాప్ లో కింగ్ ఖాన్ ‘జవాన్’
‘యానిమల్’ అడ్వాన్స్ బుకింగ్స్… సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా సినిమా ‘జైలర్’ ప్రీ-సేల్స్ కలెక్షన్‌లను మించిపోయింది. జైలర్ రూ.18.50 కోట్ల గ్రాస్‌ను వసూలు చేయగా ఆ రికార్డును ‘యానిమల్’ బద్దలగొట్టింది. ఇక ఇదే హవా కొనసాగితే సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ 3’ సాధించిన రూ.23 కోట్ల గ్రాస్‌ను, అలానే ప్రభాస్ ఆదిపురుష్ కొల్లగొట్టిన రూ.26.50 కోట్ల గ్రాస్‌ను కూడా యానిమల్ బీట్ చేయడం పక్కాగా కనిపిస్తోంది. అయితే షారుక్ ఖాన్ నటించిన పఠాన్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో రూ.32.43 కోట్ల గ్రాస్ సాధించింది. అలానే షారుక్ సినిమా జవాన్ ఇప్పటివరకూ బాలీవుడ్‌లో ఓపెనింగ్ డే అత్యధిక అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్‌లు సాధించిన సినిమాగా నిలిచిపోయింది. ఇది ఏకంగా రూ.41 కోట్లు కొల్లగొట్టింది.
Also Read : Allu Arjun: తన ఇంట్లో పనిమనిషితో బన్నీ సెల్ఫీ వీడియో