Anil Ravipudi : మినిమం గ్యారెంటీ దర్శకుడిగా పేరు పొందిన అనిల్ రావిపూడి(Anil Ravipudi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను తీసిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. సంక్రాంతి పర్వదినం సందర్బంగా విడుదలైన ఈ మూవీ ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. విక్టరీ వెంకటేశ్ సినీ కెరీర్ లోనే బిగ్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో పాటు గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ విడుదలైంది. దిల్ రాజు రెండు సినిమాలు నిర్మించగా అందులో ఒకటి అట్టర్ ప్లాప్ కాగా మరోటి భారీ విజయాన్ని నమోదు చేసింది.
Anil Ravipudi Strong Reaction
సినిమా సక్సెస్ సందర్బంగా చిట్ చాట్ లో అనిల్ రావిపూడి తన అభిప్రాయాలను పంచుకున్నారు. తనను ట్రోల్ చేస్తూ , మీమ్స్ పెడుతున్నారని, ఆ వీడియోలను తమ కుటుంబానికి చెందిన వారికి, ప్రత్యేకించి తన భార్యకు పంపిస్తున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే కంటిన్యూ చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు అనిల్ రావిపూడి.
సోషల్ మీడియా వేదికగా ఫేక్ వీడియోలను షేర్ చేసినా లేదా పోస్ట్ చేసినా ఊరుకోనంటూ నిప్పులు చెరిగారు. వారిపై చర్యలు తీసుకునేలా తాను పోలీసులను ఆశ్రయిస్తానని తెలిపాడు. వెంటనే అలాంటి వాటిని తీసి వేయాలన్నారు. తాను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లవుతోందని, కళ్యాణ్ రామ్ తనకు ఛాన్స్ ఇచ్చాడని 10 ఏళ్లుగా డైరెక్టర్ గా సక్సెస్ లో ఉన్నానని చెప్పాడు.
Also Read : Beauty Manisha Koirala :నాకు ఓ తోడు కావాలని ఉంది