Anil Ravipudi : టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ దర్శకుడిగా పేరొందిన అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టార్లు ఎవరనేది ముఖ్యం కాదని, సినిమాకు సంబంధించి కథే ముఖ్యమన్నారు. కంటెంట్ ఈస్ ద కింగ్ అని, అదే సినిమాకు ప్రాణమన్నారు. గతంలో తాను తీసిన పటాస్ , సుప్రీం , రాజా ది గ్రేట్ , ఎఫ్ 2, ఎఫ్3, సరిలేరు నీకెవ్వరు, భగవంత్ కేసరి ఇలా ప్రతి సినిమాలో ఏదో ఒక థీమ్ ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందని చెప్పాడు అనిల్ రావిపూడి(Anil Ravipudi).
Anil Ravipudi Shocking Comments
ఒక్కో హీరోతో ఒక్కో అనుభవం దక్కిందని, కానీ ఎవరికి వారే ప్రత్యేకమని స్పష్టం చేశాడు. తనకు సినిమాలంటే పిచ్చి అని, తనపై నమ్మకం ఉంచి, వెన్నుతట్టి ప్రోత్సహించింది మాత్రం నందమూరి కళ్యాణ్ రామ్ అని, ఆయనను జీవితంలో మరిచి పోలేనని అన్నారు.
ఇక వరుణ్ తేజ్, మాస్ మహరాజా రవితేజతో అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు. ఇక మహేష్ బాబుతో షూటింగ్ చేసిన సమయం చాలా హాయిగా , ప్రశాంతంగా గడిచి పోయిందన్నాడు. తను ఓ అద్బుతం అని కొనియాడాడు.
ఇదే సమయంలో విక్టరీ వెంకటేశ్ తో కంటిన్యూగా మూడు సినిమాలు చేశానని, తనతో జర్నీ వెరీ వెరీ స్పెషల్ అని తెలిపాడు . తాజాగా తీసిన సంక్రాంతికి వస్తున్నాం ఊహించని సక్సెస్ ఇచ్చిందన్నాడు. తన లక్ష్యం ఒక్కటేనని అది ఇంటిల్లిపాది కలిసి చూసేలా సినిమాలు తీయడం అన్నాడు అనిల్ రావిపూడి. ఈ మూవీ ఇప్పటి వరకు రూ. 250 కోట్లను కొల్లగొట్టింది..రూ. 300 కోట్లకు దగ్గరగా ఉంది.
Also Read : INDW vs SAW Victory : అండర్ 19 మహిళల వరల్డ్ కప్..ఇండియా విక్టరీ