Suma Kanakala: ప్రముఖ యాంకర్ సుమ కనకాల అనుకోని వివాదంలో చిక్కుకున్నారు. చలాకీ మాటలు, స్పాంటేనియస్ పంచులతో అచ్చ తెలుగు అమ్మాయిలా… మన ఇంట్లో మనిషిలా బుల్లితెరతో పాటు ఎంతటి పెద్ద హీరో సినిమా యాంకరింగ్ కైనా మొదటి ప్రాధాన్యత సుమకే ఇస్తారు. ఈ నేపథ్యంలో సుమ టీవీ షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, మూవీ ఇంటర్వ్యూలు ఇలా ఒకటేమిటి ఊపిరి సలపనంత బిజీగా ఉన్నప్పటికీ ఈమె ఆచితూచి మాట్లాడుతూ ఉంటుంది. వివాదాలకు పూర్తిగా దూరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఊహించని కాంట్రవర్సీలో చిక్కుకుంది.
ఓ సినిమా హీరో కంటే ఎక్కువ మంది మద్యతరగతి అభిమానులను సంపాదించుకున్న సుమను ఇటీవల పలు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తోంది. డబుల్ హార్స్ మినపగుల్లుతో పాటు పలు వంట సామాన్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు యాడ్స్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈమె బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ బోర్డు తిప్పేయడంతో… ఆ రియల్ ఎస్టేట్ బాధితులంతా ఇప్పుడు సుమ వెంట పడుతున్నారు. సుమ(Suma Kanakala) చెప్పడం వల్లే తాము లక్షల రూపాయలు పోగొట్టుకున్నామని ఆరోపిస్తున్నారు.
Suma Kanakala – ఇంతకీ అసలేమైందంటే ?
రాజమండ్రిలో రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఉంది. మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కల నెరవేరుస్తామని చెప్పింది. అపార్ట్‌మెంట్స్ కట్టి ఫ్లాట్స్ ఇస్తామని చెప్పి ప్రచారం చేసింది. ఈ సంస్థకు సుమ పలు కమర్షియల్ యాడ్స్ చేసింది. ఈ క్రమంలోనే పలువురు ప్రజలు ఇందులో పెట్టుబడులు పెట్టారు. అలా రూ.88 కోట్ల మొత్తంతో సంస్థ బోర్డు తిప్పేసింది. దీనితో తమకు న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
‘రాకీ అవెన్యూస్ కట్టిన ఫేజ్-1 బిల్డింగ్స్ చూశామని, ఫేజ్-2 త్వరలో కడతామని సుమ(Suma Kanakala)తో ప్రచారం చేయించడం వల్ల ఈ సంస్థలో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చాం. నేను త్రీ బెడ్రూమ్ ఫ్లాట్స్ నాలుగు తీసుకుని ఒక్కో దానికి రూ.25 లక్షలు కట్టాను. ఇప్పుడు మోసపోయామని’ రాజమహేంద్రవరంలో నిర్వహించి మీడియా సమావేశంలో ఓ బాధితుడు తన ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇలా రియల్ ఎస్టేట్ సంస్థ ప్లేట్ ఫిరాయించడంతో యాంకర్ సుమపై పలువురు విమర్శలు చేస్తున్నారు. ఈ యాడ్‌లో సుమతో పాటు ఆమె భర్త, నటుడు రాజీవ్ కనకాల కూడా నటించారు. ఇప్పుడు కొందరు బాధితులు.. సుమ ఈ విషయంపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంలో తర్వాత ఏం జరుగుతుందనేది చూడాలి?
Also Read : Vishwak Sen: కొత్త సినిమా ప్రకటించిన విష్వక్ సేన్ !