Anchor Ravi : బుల్లితెర వేదికగా సుడిగాలి సుధీర్, యాంకర్ రవి చేసిన స్కిట్ తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ కార్యక్రమం పూర్తిగా తమ మనో భావాలను కించపర్చేలా చేసిందంటూ హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశాయి. నేరుగా యాంకర్ రవి(Anchor Ravi) ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి సీరియస్ అయ్యారు. ఈ సందర్బంగా తమ కెరీర్ కు, వ్యక్తిగతంగా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందని గమనించారు. ఈ సందర్బంగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో ద్వారా సందేశం ఇచ్చాడు. వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
Anchor Ravi Says Sorry to Hindu
ఇదిలా ఉండగా రియాల్టీ షోలో యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ నందీశ్వరుడితో కూడిన సన్నివేశం మనో భావాలను పూర్తిగా దెబ్బ తీసేలా ఉన్నాయంటూ హిందూ బంధువులు, నేతలు , ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ, భజరంగ్ దళ్ , తదితర సంస్థలు భగ్గుమనడంతో యాంకర్స్ ఎట్టకేలకు తగ్గారు. గతంలో క్షమాపణలు కోరినప్పటికీ, రవి ఇప్పుడు ఈ విషయంపై మరింత స్పష్టత ఇస్తూ మరో వీడియోను విడుదల చేశాడు.
తన వీడియోలో, రవి ఇలా పేర్కొన్నాడు. తాను మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీని అనుసరిస్తానని చెప్పాడు. ప్రతి నిత్యం హనుమాన్ చాలీసా చదువుతానంటూ స్పష్టం చేశాడు. తాను నిద్ర లేచిన వెంటనే శివ, పార్వతులను స్మరిస్తానంటూ చెప్పాడు. మీరు అనుకున్నట్టుగా నేను కానీ, సుధీర్ కానీ హిందూ ధర్మాన్ని, సంప్రదాయాలకు వ్యతిరేకం కాదంటూ స్పష్టం చేశారు. మరోసారి మీరంతా మమ్మల్ని క్షమించాలని కోరారు.
Also Read : Hero Ajith-Good Bad Ugly :గుడ్ బ్యాడ్ అగ్లీ బాక్సాఫీస్ కలెక్షన్స్ రూ.62 కోట్లు