Anasuya : ఏపీ డిప్యూటీ సీఎంతో పాటు చేయడం అదృష్టం అంటున్న అనసూయ

మళ్ళీ చాలా సంవత్సరాల తరువాత పవన్ కళ్యాణ్ తో 'హరి హర వీరమల్లు' లో ఒక పాటలో నటించింది అనసూయ...

Hello Telugu - Anasuya

Anasuya : యాంకర్, నటి అనసూయ ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉంటుంది. తన మాటలతో, కామెంట్స్ తో, లేదా ఇంకెవరిపైనో ఏదైనా కామెంట్ చేసో, ఇలా అనసూయ ఎప్పుడూ వార్తల్లో ఉంటూ వస్తోంది. అప్పుడెప్పుడో ‘అత్తారింటికి దారేది’ సినిమాలో అనసూయ(Anasuya)ని పవన్ కళ్యాణ్ పక్కన ఒక స్పెషల్ సాంగ్ కోసం అడిగితే, అప్పుడు చెయ్యను అని చెప్పింది అనసూయ. అప్పట్లో ఆమెని పవన్ కళ్యాణ్ అభిమానులు బాగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. మళ్ళీ చాలా సంవత్సరాల తరువాత పవన్ కళ్యాణ్ తో ‘హరి హర వీరమల్లు’ లో ఒక పాటలో నటించింది అనసూయ. అప్పటి విషయాలు గుర్తు చేసుకుంటూ, “నన్ను ట్రోల్ చేసే ట్రెండ్ అయన (పవన్ కళ్యాణ్) తోటే మొదలైంది” అని చెప్పింది అనసూయ. తనకి ఎవరైనా నీకు నటన రాదు అని చెపితే, అప్పుడు పాటలు చేస్తాను అని చెప్తోంది అనసూయ. తనకి నటన అంటే ప్రాణం అని, ఇషం అని, ఎవరైనా పాట చెయ్యమని అడిగితే క్యారెక్టర్ లేదా అని అడుగుతూ వుంటాను అని చెపుతూ ఉంటుంది అనసూయ.

Anasuya Comment

అయితే ‘హరి హర వీరమల్లు’ లో పవన్ కళ్యాణ్ తో పాట చెయ్యడానికి ఆ సినిమా దర్శకుడు కారణం అని చెపుతోంది అనసూయ. ” ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తో పాట చెయ్యడం గర్వంగా వుంది. ఆ పాట చేసేటప్పుడు నేను చాలా తక్కువ సమయం పవన్ కళ్యాణ్ తో గడిపాను, అయినా అది చాలా విలువైన సమయం. అతను రాజకీయాల్లోకి రావటం, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవటం, అతనితో అప్పుడు ఆ పాట కోసం గడిపిన సమయం ఒక అనుభూతి” అని చెప్పుకొచ్చింది అనసూయ(Anasuya). ‘ పుష్ప 2’ సినిమాలో పాత్ర గురించి అడిగితే మా సార్ ఒప్పుకోరు అందుకని నేను చెప్పను అని చెప్పింది అనసూయ. ‘ సింబా’ సినిమాలో అనసూయ మరొక పవర్ ఫుల్ పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో ఒక మెసేజ్ కూడా వుంది. పర్యావరణం నేపథ్యంలో చేస్తున్న ఒక సూపర్ నాచురల్ థ్రిల్లర్ ఈ సినిమా అని చెప్పింది. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది. ఈ సందర్భంగా అనసూయ పలు విషయాలు గురించి పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.

Also Read :  Nayanthara : మరో కొత్త ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీతో వస్తున్న ‘నయనతార’

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com