Pawan Kalyan : జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న హరి హర వీరమల్లుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ కూడా పూర్తయింది. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ మాత్రమే మిగిలి ఉంది. ఈ సందర్బంగా మూవీ మేకర్స్ కీలక అప్ డేట్ ఇచ్చారు చిత్రానికి సంబంధించి. అందాల ముద్దు గుమ్మలు పూజిత పొన్నాడ..అనసూయ భరద్వాజ్ పవర్ స్టార్(Pawan Kalyan) తో స్టెప్పులు వేయనున్నారు. ఈ విషయాన్ని కూడా కన్ ఫర్మ్ చేశారు దర్శకుడు.
Pawan Kalyan Movie Updates
ఇదిలా ఉండగా మూవీకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ వచ్చారు. పోస్టర్స్, పాటలు, టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మాట వినాలి అనే పేరుతో పాట పాడాడు. ఈ సాంగ్ ను మిలియన్ల కొద్దీ చూశారు. వీక్షించారు. ఇంకా టాప్ లో కొనసాగుతోంది. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లుకు సంబంధించి రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసింది.
ఈ సినిమాను సీక్వెల్ గా తీస్తామని ప్రకటించారు. పార్ట్ -1ను వచ్చే మార్చి నెల 28న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. విచిత్రం ఏమిటంటే ఈ సినిమాకు సంబంధించి దర్శకుడిని మార్చేశాడు పవన్ కళ్యాణ్. గతంలో జాగర్లమూడి క్రిష్ ఉండగా ఇప్పుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.
చారిత్రాక నేపథ్యంలో హరి హర వీరమల్లు మూవీని తెరకెక్కించాడు . ఇదిలా ఉండగా నిన్న పవన్ కళ్యాణ్ విల్లంబును ధరించి రిలీజ్ చేసిన పోస్టర్ దుమ్ము రేపుతోంది. ఇక స్టార్ హీరోతో పూజిత, అనసూయ సూపర్ స్టెప్పులు వేయబోతున్నారు.
Also Read : Terrific Mystirious Movie : ‘మిస్టీరియస్’ సస్పెన్స్..థ్రిల్లర్