Anasuya : అటు సినిమాలలో ఇటు రియాల్టీ షోస్ తో బిజీగా ఉంటోంది అనసూయ భరద్వాజ్(Anasuya). టాలీవుడ్ కు సంబంధించి తను వెరీ వెరీ స్పెషల్. మనసులో ఏదీ దాచుకోదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది. ఎవరైనా ఏదైనా అంటే వెంటనే ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఎవరికీ తల వంచదు. తనకు నచ్చింది చేస్తుంది. తన అభిప్రాయాలను స్వేచ్చగా చెప్పేస్తుంది. అంతే కాదు సోషల్ మీడియాలో తను మరింత పాపులర్ కూడా. అటు ఇన్ స్టాలో ఫోటోస్, కామెంట్స్ తో పాపులర్ అయ్యింది. ఇటు ఎక్స్ వేదికగా తన ఆలోచనలను పంచుకుంటోంది.
Anasuya Shcoking Comments
తాజాగా అనసూయ భరద్వాజ్ కు చిర్రెత్తుకు వచ్చింది. హోలీ పండగ సందర్బంగా హైదరాబాద్ లో ఓ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్ కు ప్రత్యేక అతిథిగా హాజరైంది . ఓ ఆకతాయి ఎవరో వెనుక నుంచి ఆంటీ అంటూ పిలిచ్చారు. దీనిని విన్న వెంటనే సీరియస్ గా రియాక్ట్ అయ్యారు అనసూయ భరద్వాజ్. అరేయ్ దమ్ముంటే నా ముందుకు రా..నేనిమిటో చూపిస్తా అంటూ స్టేజి పై నుంచే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు , వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఇదిలా ఉండగా తనకు ముందు నుంచి ఆంటీ అనడం ఇష్టం ఉండదు. ఈ విషయాన్ని అనసూయ భరద్వాజ్ పదే పదే చెబుతూ వస్తోంది. అదేపనిగా నెటిజన్లు కూడా ఆమెను ట్రోల్ చేయడం, కామెంట్స్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. చెర్రీ నటించిన మూవీలో రంగమ్మత్తగా పేరు పొందింది. ఆ తర్వాత రజాకర్ చిత్రంలో అద్భుతమైన పాత్ర పోషించింది. తనలో మంచి నటి ఉందని నిరూపించింది. ఏది ఏమైనా ఎదుటి వాళ్లను కించ పరిచేలా మాట్లాడటం మంచిది కాదు.
Also Read : Samantha Sensational :సమంత రుత్ ప్రభు నెట్టింట్లో వైరల్