అనసూయ భరద్వాజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అటు సినిమాల్లో ఇటు బుల్లి తెరపై ఈ మధ్యన ఎక్కువగా కనిపిస్తోంది. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. ఇన్ స్టా గ్రామ్ లో ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.
తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ. తనకు నీలాంటి మగాడు కావాలంటూ పేర్కొంది. నెటిజన్స్ విస్తు పోయారు. ఇప్పటికే పిల్లల తల్లి అయిన అనసూయ ఎందుకు ఇలా మాట్లాడిందంటూ ఆరా తీశారు.
తీరా చూస్తే ఆ అసలైన మగాడు ఎవరో కాదు నువ్వేనంటూ తన భర్త భరద్వాజ్ గురించి కితాబు ఇచ్చింది. దీంతో ఔరా అనసూయా మజాకా అంటున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ట్రెండింగ్ లో కొనసాగుతోంది ఈ బోల్డ్ బ్యూటీ.
ఎంతైనా సినిమా రంగమైనా, లేదా బుల్లి తెర అయినా , ఓటీటీ అయినా దీపం ఉన్నంత వరకే . సక్సెస్ ఉంటేనే పలకరిస్తారు. ఆ తర్వాత చూసీ చూడనట్టు ఉంటారు. ఇలా చాలా మంది తెర మరుగైన వాళ్లు ఎందరో . అందుకేనేమో ఎప్పటికప్పుడు తాజా కామెంట్స్ ,పోస్టులతో తనను తాను ప్రూవ్ చేసుకునే పనిలో పడింది అనసూయ.