Anasuya : టాలీవుడ్ లో ఫుల్ బిజీగా మారి పోయింది నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్(Anasuya). తను సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను పంచుకుంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తుంది. ఫ్యాన్స్ తో , నెటిజన్లతో నిత్యం ఇంటరాక్ట్ అవుతుంది ఈ ముద్దుగుమ్మ. ఆ మధ్యన బికినీ ఫోటోలతో యువతను మెస్మరైజ్ చేసింది. తాజాగా చిట్ చాట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
Anasuya Shocking Comments
ఆ మధ్యన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించేందుకు తనకు ఛాన్స్ దక్కిందని, ఆ సినిమా అత్తారింటికి దారేది అని చెప్పింది. ఇందులో పబ్ సాంగ్ ఉంది. దానిలో నటించాలని డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆఫర్ ఇచ్చాడని, కానీ తాను వద్దనుకున్నానని చెప్పింది. సింగిల్ అయితే తాను నటించేందుకు సిద్దమని, కానీ మరో ఇద్దరిత కలిసి నటించనని కుండ బద్దలు కొట్టింది.
అప్పట్లో నా మైండ్ సెట్ అలా ఉండేదన్నారు. కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు చెప్పింది. ప్రస్తుతం తను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీస్తున్న హరి హర వీరమల్లు మూవీలో స్పెషల్ సాంగ్ లో నటించింది. ఇందుకు సంబంధించి తను ఎందుకు ఇప్పుడు ఓకే చెప్పాల్సిందో కుండ బద్దలు కొట్టింది. ప్రస్తుతం వైరల్ గా మారింది.
Also Read : Beauty Kiara Advani : కియారా అద్వానీ మెప్పించ లేక పోతోందా..?