Anasuya Bharadwaj : ప్రస్తుతం ‘పుష్ప 2’ గురించి చర్చ జరగని చోటు లేదు. అది మంచైనా, చెడైనా పుష్ప గురించే మాట్లాడుతున్నారు. ఆ దిశగానే కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ చర్చల్లో సోషల్ మీడియా రచ్చ టాప్ లోనే ఉంటుంది. మరి ఈ చర్చల్లోకి దాక్షాయణి అలియాస్ అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj) ఎంటర్ కాకుండా ఎలా ఉంటారు.
Anasuya Bharadwaj Comments
ఒకవైపు ఈ సినిమాకి కొందరు పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తుంటే .. మరికొందరు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. చాలా మంది పుష్ప 2(Pushpa 2) కంటే పుష్ప 1 బెటర్ అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అలాగే మొదటి పార్ట్ లోనే కథ, డ్రామా, ఎమోషన్, విలనిజం బాగా వర్కౌట్ అయ్యాయని పేర్కొంటున్నారు. ఇక సెకండ్ పార్ట్ లో అల్లు అర్జున్ నట విశ్వరూపం మినహా ఏవి పెద్దగా ఆకట్టుకోలేదని తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే అనసూయ కలుగజేసుకొని.. ” అసలు ఇలా ఎందుకు పోల్చుతున్నారు. సీక్వెల్ అంటే కంటిన్యూటీ కదా! మీరు మొదటి పార్టుతో ఎందుకు పోల్చుతున్నారు.. ఇలా పోల్చడం ఎంత వరకు సబబు” అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్ లో వచ్చిన పాత్రలను సరిగ్గా చూపించలేదని పెద్ద కంప్లైంట్ ఉంది. దీనికి అనసూయ స్పందిస్తూ.. ఏదైనా ఒక ఫ్లో లో కదా చూడాల్సింది అని డిఫెండ్ చేశారు.
మరోవైపుఈ సినిమా రాజమౌళి, రామ్ చరణ్, రామారావుల ‘RRR’ రికార్డులను కూడా బద్దల కొట్టి కలెక్షన్ల సునామీ సృష్టించేసింది. ఇంతకు ముందు ఉన్న ఆర్ఆర్ఆర్ డే 1 రికార్డ్ రూ. 233 కోట్ల గ్రాస్. పుష్పరాజ్ డే 1 సెట్ చేసిన రికార్డ్ రూ. 294 కోట్ల గ్రాస్. ఇది ఐకానిక్ స్టార్ సత్తా. ఇంకా నైజాం, హిందీ బెల్ట్‌లో కూడా ‘పుష్పరాజ్’ సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. నైజాంలో ఇప్పటి వరకు ఉన్న ఆర్ఆర్ఆర్ రూ. 23 కోట్ల రికార్డును రూ. 30 కోట్లు రాబట్టి మరో హిస్టరీని నెలకొల్పాడు పుష్ప.
Also Read : SDT18 Movie : సాయి ధరమ్ తేజ్ ‘ఎస్ డీటీ 18’ సినిమా నుంచి కీలక అప్డేట్