అటు బుల్లి తెరపై ఇటు వెండి తెరపై తన లక్ ను పరీక్షించు కుంటోంది అనసూయ భరద్వాజ్. ఆమె నటిగా, యాంకర్ గా , జడ్జిగా పలు పాత్రలు పోషిస్తోంది. సాధ్యమైనంత మేర ఏ మాత్రం సమయం చిక్కినా వెంటనే సోషల్ మీడియాలో బిజీగా గడుపుతుంది. ఫ్యాన్స్ వేసే ప్రశ్నలకు సరదాగా ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది.
ఇది పక్కన పెడితే సినిమాలతో బిజీగా ఉన్న అనసూయ భరద్వాజ్ లేడీ డాన్ ఓరియెంటెడ్ పాత్రలకే ఎక్కువగా మొగ్గు చూపున్నట్లు టాక్. ఆ మధ్యన సునీల్ తో కలిసి దర్జా సినిమాలో నటించింది. గత ఏడాది రిలీజ్ అయ్యింది. ఇందులో రౌడీ పాత్రకు సరిగ్గా సరి పోయింది. ఇదే సమయంలో తన అందాల ప్రదర్శనపై కూడా ఏ మాత్రం తగ్గలేదు .
డిఫరెంట్ రోల్స్ చేస్తోంది. ఫ్యాన్స్ ను మత్తెక్కించేలా చేస్తోంది. రంగస్థలంలో రంగమ్మ అత్తగా మెప్పించిన అనసూయ ఆ తర్వాత తిరుగు లేకుండా పోయింది. ఆ పాత్ర ఆమెకు మంచి పేరు తీసుకు వచ్చేలా చేసింది. ఇదంతా దర్శకుడు సుకుమార్ మహిమేనంటోంది ముద్దుగుమ్మ.
చాలా మంది అనసూయ అభిమానులు ఇలాంటి రోల్స్ తనకు సరి పోతాయని పేర్కొంటున్నారు. ఏది ఏమైనా అనసూయ ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిందన్నది వాస్తవం.