Ananya Panday : సినీ తారల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉండడం సర్వసాధారణం. మరీ ముఖ్యంగా హీరోయిన్ల వ్యక్తిగత వివరాలపై ఎక్కడలేని ఇంట్రెస్ట్ ఉంటుంది. హీరోయిన్లు సైతం తమ రిలేషన్ షిప్‌కి సంబంధించిన వివరాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే(Ananya Panday) తన రిలేషన్‌షిప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఇచ్చిన ఓ పాడ్‌కాస్ట్‌లో పలు విషయాలను చర్చించింది. గతంలో తాను రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయాలను పంచుకుంది. ఎదుటి వ్యక్తి కోసం నేనెంతగానో మారానని, చాలా విషయాల్లో రాజీపడ్డానని చెప్పుకొచ్చారు. బంధంలో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి మెప్పు పొందడం, వారి దృష్టిని ఆకర్షించడం కోసం ఏదైనా చేయాలనిపిస్తుందని తెలిపింది.
Ananya Panday Comments…
మనం ఇష్టపడే వారి కోసం ఎంత మారినా ఫర్వాలేదనిపిస్తుందన్న అనన్య.. మనం మారుతున్నామనే విషయం మొదట్లో మనకు అర్థం కాదని, ఇది సహజంగానే ఉన్నట్లు అనిపిస్తుందని తెలిపింది. ప్రేమలో ఉన్నప్పుడు లోపాలు తెలియవన్న అనన్య.. ఏదీ మనకు సమస్యగా అనిపించదు. ఆ బంధం నుంచి బయటకు వచ్చినప్పుడే మీకు అన్నీ అర్థమవుతాయని చెప్పుకొచ్చింది.అయితే తాను మాత్రం రిలేషన్‌షిప్‌లో నిజాయతీగా ఉంటానని, ఎదుటి వ్యక్తి నుంచి కూడా అంతే నిజాయతీ లభిస్తే బాగుంటుందని తెలిపింది. ఇక తనకు కాబోయే వ్యక్తి, అన్నివిధాలా అర్థం చేసుకునేవాడు అయి ఉండాలని చెప్పుకొచ్చింది. కాగా అనన్య గతంలో నటుడు ఆదిత్యరాయ్ కపూర్‌తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల వీరిద్దరూ విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అనన్య చేసిన వ్యాఖ్యలు నెట్టింట కొత్త చర్చకు దారి తీశాయి.
Also Read : Allu Arjun : కేరళ ‘పుష్ప 2’ ప్రమోషన్స్ లో అభిమానులపై ప్రశంసల వర్షం