Ananya Nagalla : అచ్చ తెలుగమ్మాయి హీరోయిన్ అనన్య నాగళ్ల త్వరలో పొట్టేల్ అనే రూరల్ పిరియాడిక్ డ్రామా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. దీపావళికి ఈ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర యూనిట్ ప్రెస్మీట్ నిర్వహించి చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. అనంతరం మీడియాతో క్వశచ్న్ అవర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ లేడీ జర్నలిస్టు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ ప్రశ్నలు వేయగా నటి అనన్య కూడా అదే రేంజ్‌లో జవాబు ఇచ్చి ఔరా అనిపించింది. వివరాల్లోకి వెళితే.. తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలంటే భయపడతారు.. ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వాలంటే కమిట్మెంట్ అడుగుతారని టాక్ ఉంది కదా మీకు ఇలాంటి అనుభవం ఎదురైందా అని ఓ మహిళా విలేకరి అనన్య(Ananya Nagalla)కు ప్రశ్న వేసింది. దానికి ఆమె మీరు తెలుసుకోకుండా వంద శాతం ఉంటుందని ఎలా అడుగుతున్నారని జవాబిచ్చింది.
Ananya Nagalla Comment
మీరు చేసే అగ్రిమెంట్ట్‌లో కూడా ఉంటుందట కదా, మా ఫ్రెండ్సే చెప్పారు అని మరో క్వశ్చన్ వేయగా ఈ వందశాతం తప్పు అని ఆనన్య(Ananya Nagalla) సమాధానమిచ్చింది. అవకాశం రావడం కంటే ముందే కమిట్మెంట్ అనేది టాలీవుడ్‌లో లేదని, ఎక్కడైనా పాజిటివ్, నెగెటివ్ అనేది సమానంగా ఉంటాయని మీరు ఎక్స్ పీరియన్స్ చేయకుండా అలా ఎలా అడుగుతున్నారంటూ అనన్య ఆన్సర్ ఇచ్చింది. అంతేగాక నటిగా నేను చెబుతున్నా క్యాస్టింగ్ కౌచ్ పరిస్థితులైతే ఇండస్ట్రీలో లేవని తెలిపారు. కమిట్మెంట్ను బట్టే పారితోషికం ఉంటుందని ఇండస్ట్రీలో వినిపిస్తుంటుంది అని మరో ప్రశ్న అడగగా.. మీరు విన్న మాటలు చెబుతున్నారు. కానీ, నేను ఆ ఫీల్డ్ లోనే ఉన్నా. మీరు అనుకున్నది ఇక్కడ లేదని అనన్య గట్టిగా బదులిచ్చింది. అక్కడ అనన్య సమాధానాలు విన్న చాలామంది అనన్య ధైర్యాన్ని, బయ పడకుంగా చెప్పిన విధానాన్ని చాలామంది మెచ్చుకోవడమే కాక చప్పట్లతో ప్రశంసించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Also Read : Miss India 2024 : ఫెమినా మిస్ ఇండియా 2024 విజేతగా ‘నిఖితా పోర్వల్’