Ananya Nagalla : తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఇప్పటి వరకు 25 మందికి పైగా యూట్యూబర్స్, తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన నటీ నటులపై కేసులు నమోదు చేశారు. దగ్గుబాటి రానా, నిధి అగర్వాల్, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్ , రానా దగ్గుబాటి, శ్రీముఖి, విష్ణు ప్రియ, రితు చౌదరితో పాటు అనన్య నాగళ్ల(Ananya Nagalla)ను కూడా ఇందులో చేర్చారు. తాజాగా రామారావు అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు.
Ananya Nagalla Shocking Comments on Betting Apps Promotion
ఫన్ 88 అనే బెట్టింగ్ యాప్ ను నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ ప్రమోషన్ చేశారని ఆరోపించాడు. వారిని నమ్మి తాను డబ్బులు పెట్టానని, ఆ తర్వాత మోస పోయానని, తన డబ్బులు తనకు ఇప్పించాలని కోరాడు. ఈ మేరకు ఫిర్యాదు కూడా చేశాడు. దీనిపై ఉక్కు పాదం మోపారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి. మరో వైపు ఏకంగా బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా తన గళం విప్పారు పోలీస్ బాస్, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. సోషల్ మీడియా వేదికగా నిరంతరం చైతన్యవంతం చేస్తున్నాడు.
తన కారణంగా ఇప్పుడు యూట్యూబర్లు, సినీ సెలెబ్రిటీలు పోలీసు వలలో చిక్కుకున్నారు. అంతా అయి పోయాక తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరు తమ టీమ్ ల ద్వారా తాము కరెక్టుగా ఉన్న వాటికే ప్రమోషన్ చేశామని చెబుతున్నారు. ఈ తరుణంలో అందాల ముద్దుగుమ్మ నటి అనన్య నాగళ్ల స్పందించింది. తనకు ఏ పాపం తెలియదని, ఇతర నటీ నటులు ప్రమోషన్స్ చేయడంతో తాను కూడా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోషన్ చేయాల్సి వచ్చిందంటూ సరిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. ఇక నుంచి అలాంటి వాటికి దూరంగా ఉంటానని పేర్కొంది అనన్య నాగళ్ల.
Also Read : Hero Nithin Robinhood Promotions : రాబిన్ హుడ్ ప్రమోషన్ లో వార్నర్ బిజీ