Ananth Ambani Wedding: అంబానీ ఇంట మొదలైన పెళ్లి సందడి ! క్యూ కడుతున్న సెలబ్రెటీలు !

అంబానీ ఇంట మొదలైన పెళ్లి సందడి ! క్యూ కడుతున్న సెలబ్రెటీలు !

Hello Telugu - Ananth Ambani Wedding

Ananth Ambani Wedding: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ(Mukesh Ambani) ఇంట పెళ్లి సందడి మొదలైంది. తన రెండో కుమారుడు అనంత్ అంబానీ… మరో పారిశ్రామిక వేత్త వీరేన్ మర్చండ్ కుమార్తె రాధిక మర్చంచ్ ల పెళ్ళి వేడుక గుజరాత్ లోని జామ్ నగర్ లో ప్రారంభం అయింది. జూలై 12న ముంబైలో వీరి వివాహం జరగనుండగా జామ్‌ నగర్‌ లో మూడు రోజుల పాటు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించబోయే ఈ పెళ్లి వేడుకలో పాల్గొనడానికి ప్రపంచ నలుమూలల నుండి వ్యాపార, రాజకీయ, సినీ ప్రముఖులు జామ్ నగర్ చేరుకున్నారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక, మెటా అధినేత మార్కు జుకర్‌బర్గ్, ఆయన సమీమణి ప్రిసిల్లా చాన్‌ తో కలిసి పాల్గొన్నారు.

Ananth Ambani Wedding Updates

జామ్‌ నగర్‌లో శుక్రవారం జరిగిన అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు. ఈ కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ దంపతులు, అమీర్‌ఖాన్‌, అనిల్‌ కపూర్‌, సోనమ్‌ కపూర్‌, కరీనా కపూర్‌, కరిష్మా కపూర్‌, సైఫ్‌ అలీఖాన్‌, అజయ్‌ దేవగణ్‌, మాధురీ దీక్షిత్‌, శ్రద్ధా కపూర్‌, దిశా పటానీ, అనన్య పాండే తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది.

Also Read : Vishnu Manchu: భార్య విరానికాకు బిగ్‌ సర్‌ ప్రైజ్‌ ఇచ్చిన మంచు విష్ణు !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com