Anaganaga Oka Raju : టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ కలిగిన నటుడిగా గుర్తింపు పొందాడు నవీన్ పోలిశెట్టి. తను నటించిన జాతి రత్నాలు సూపర్ డూపర్ హిట్. తాజాగా తను కీ రోల్ పోషిస్తున్న చిత్రం అనగనగా ఒక రాజు. ఇందులో తనతో జత కట్టింది అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. తనకు ఈ ఏడాది సూపర్ డూపర్ హిట్ వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన వెంకీతో తీసిన సంక్రాంతికి వస్తున్నాం. ఇది ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూలు సాధించింది.
Anaganaga Oka Raju Movie Teaser Viral
ఈ సినిమాలో మీనాక్షి చౌదరి వెంకటేశ్ కు మాజీ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో నటించి మెప్పించింది. దీంతో ఆమెకు వరుసగా మూవీస్ లో ఛాన్స్ లు వస్తున్నాయి. కాగా అనగనగా ఒక రాజు చిత్రంలో ముందుగా లవ్లీ బ్యూటీ శ్రీలీలను అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో మీనాక్షి(Meenakshi Chaudhary)ని భర్తీ చేశారు దర్శక, నిర్మాతలు. దీనిని నాగ వంశీ నిర్మిస్తున్నాడు. తను ఎవరూ ఊహించని రీతిలో తమిళ సూపర్ స్టార్ నటించిన కూలీ రైట్స్ కొనేందుకు ఏకంగా రూ. 40 కోట్లు ఆఫర్ చేశాడు. ఇక తాజాగా చిత్రం మరింత బాగా ఉండేలా తీయాలని కంకణం కట్టుకున్నాడు.
ఇందుకు సంబంధించి అనగనగా ఒక రాజు చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది. పూర్తిగా నవ్వులు పూయించేలా ఉంది. ఇంటిల్లిపాది కలిసి చూసేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా నవీన్ , మీనాక్షిల కాంబినేషన్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందని సినిమా చూస్తేనా కానీ చెప్పలేం.
Also Read : Popular Singer Gaddar Awards :గద్దర్ అవార్డు రేసులో పుష్ప2 ..?