Rashmika : క్రంచీరోల్ అనిమీ అవార్డ్స్‌లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించడానికి స్టార్ హీరోయిన్ రష్మిక మందన టోక్యో వెళ్లారు. శనివారం టోక్యోలో అవార్డు ప్రదానోత్సవం జరగనుంది. గ్లోబల్ ఈవెంట్ అయిన ఈ అవార్డు కార్యక్రమంలో రష్మిక భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ ఘనత అందుకున్న ఏకైక నటిగా రష్మిక మందన(Rashmika) రికార్డు సృష్టించింది. అయితే, టోక్యో విమానాశ్రయంలో ఆమెకు జపాన్ అభిమానులు ఆశ్చర్యకరంగా స్వాగతం పలికారు. తన ఫోటోతో రూపొందించిన పోస్టర్‌ను చూపించి రష్మికను ఆహ్వానించారు.
Rashmika Got Grand Welcome
ఎయిర్‌పోర్టులో అభిమానుల నుంచి లభించిన స్వాగతం చూసి రష్మిక ఆశ్చర్యపోయింది. ఆమె ఆశ్చర్యంతో వారిని పలకరించింది. పుష్ప, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాలతో జాతీయ తారగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది రష్మిక. ఆమెకు జపాన్‌లో కూడా అభిమానులు ఉన్నారు. వారి ప్రేమకు రష్మిక పొంగిపోయి ఆనందాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం రష్మిక మందన ‘పుష్ప 2’, ‘గర్ల్‌ఫ్రెండ్’ చిత్రాలతో పాటు పలు హిందీ ప్రాజెక్ట్‌లలో నటిస్తోంది.
Also Read : Kalki 2898 AD : ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న కల్కి లో నటకిరీటి