Amy Jackson: ‘క్రాక్‌’ అయిపోయింది అంటున్న అమీ జాక్సన్

‘క్రాక్‌’ అయిపోయింది అంటున్న అమీ జాక్సన్

Hello Telugu - Amy Jackson

Amy Jackson: యాక్షన్ హీరోస్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య దత్ దర్శకునిగా విద్యుత్‌ జమ్వాల్‌, అమీ జాక్సన్‌(Amy Jackson) జంటగా తెరకెక్కిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘క్రాక్‌’. ముంబైలోని మురికివాడలలో నివశించే ఓ యువకుడు… అనూహ్యంగా అతి ప్రమాదకరమైన అండర్ వరల్డ్ గేమ్ లో పావుగా మారడం ఇతివృత్తంగా తెరకెక్కించిన ఈ సినిమాలో అర్జున్‌ రాంపాల్‌, నోరా ఫతేహీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కమాండో 3 తర్వాత డైనమిక్ ద్వయం విద్యుత్ జ‌మ్వాల్- దర్శకుడు ఆదిత్య దత్‌ల అద్భుత క‌ల‌యిక వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Amy Jackson Movie Updates

ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్ డేట్ ను తన సోషల్ మీడియా అకౌంట్ వేదిగా పోస్ట్ చేసింది నటి అమీ జాక్సన్. సర్వైవల్ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘క్రాక్‌’ సినిమా చిత్రీకరణ పూర్తైంది. ఇదొక మంచి చిత్రం. ఈమధ్యే విడుదలైన ట్రైలర్‌పై మీరు చూపిస్తున్న స్పందనకు కృతజ్ఞతలు. వచ్చేఏడాది ఫిబ్రవరి 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తున్నాం’ అంటూ నటి అమీ జాక్సన్ ఓ ఫొటోని తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. దీనితో ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతోంది.

Also Read : Sriya Reddy: పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ తెలియదంటున్న శ్రియారెడ్డి

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com