Zebra Movie : అభిమాని కోసం బరిలోకి దిగనున్న మెగాస్టార్

సత్యదేవ్ సినిమాలు, సత్య దేవ్ యాక్టింగ్ అంటే చిరంజీవికి ఎంతో ఇష్టం...

Zebra : ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ ఎవైటెడ్ మల్టీ-స్టారర్ చిత్రం ‘జీబ్రా’(Zebra). ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై SN రెడ్డి, S పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. కాగా హీరో సత్యదేవ్ మెగాస్టార్ చిరంజీవికి ఎంత పెద్ద అభిమానో ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే ‘చిరు’ సత్యదేవ్‌కి ఒక సహాయం చేయనున్నారు.

Zebra Movies Updates

సత్యదేవ్ సినిమాలు, సత్య దేవ్ యాక్టింగ్ అంటే చిరంజీవికి ఎంతో ఇష్టం. ఈ విషయాన్ని ఆయన ఎన్నో వేదికల మీదుగా బహిరంగంగానే చెప్పారు. ఇక సత్య దేవ్ ‘చిరు’ వీరాభిమాని. ఇక చిరు నటించిన గాడ్ ఫాధర్ సినిమాలో సత్య దేవ్‌కి అవకాశం కల్పించాడు మెగాస్టార్. ఇదంతా పక్కనపెడితే తాజాగా విడుదలకి సిద్ధంగా ఉన్న సత్య దేవ్ ‘జీబ్రా’ సినిమా ట్రైలర్‌ను చిరంజీవి విడుదల చేయనున్నారు. ఈ ట్రైలర్ రిలీజ్ మూహూర్తం నవంబర్ 12కి ఫిక్స్ చేశారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్, టీజర్ జనాలని బాగా ఆకర్షించాయి. రవి బస్రూర్ అందించిన ఇంటెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాపై మరింత థ్రిల్ ని మరింత పెంచింది. ‘లక్ ఫేవర్స్ ది బ్రేవ్’ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సత్య పొన్మార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Also Read : Ka Movie : ‘క’ సినిమా చూసి, ఆ టీమ్ కు అభినందనలు తెలిపిన మెగాస్టార్

CinemaMega Star ChiranjeeviSatya DevTrendingUpdatesViralZebra
Comments (0)
Add Comment