Beauty Zanai Bhosle : త‌ను ప్రేమికుడు కాదు సోద‌రుడు

డేటింగ్ వార్త‌ల‌న్నీ అబ‌ద్ద‌మ‌న్న సిరిజా..భోంస్లే

Zanai Bhosle : బాలీవుడ్ సింగ‌ర్ ఆషా భోంస్లే మ‌న‌వ‌రాలు జ‌నై భోంస్లే(Zanai Bhosle) తీవ్రంగా స్పందించారు. తాను, హైద‌రాబాదీ క్రికెట‌ర్ మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్ డేటింగ్ లో ఉన్నామంటూ తెగ ప్ర‌చారం కావ‌డంపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌ను ప్రేమికుడు కాద‌ని త‌న‌కు సోద‌రుడి లాంటి వాడంటూ పేర్కొన్నారు. త‌ను క్యాజువ‌ల్ గా త‌న 23వ పుట్టిన రోజు వేడుక‌ల్లో పాల్గొన్నాడ‌ని, అంత మాత్రంగానే త‌న‌కు , సిరాజ్ కు సంబంధం అంట‌గ‌డితే ఎలా అంటూ ప్ర‌శ్నించింది ఈ ముద్దుగ‌మ్మ‌.

Zanai Bhosle Comment

త‌ను అద్భుత‌మైన పాట‌లు పాడుతుంది. అంతే కాదు త్వ‌ర‌లో న‌టిగా కూడా ఎంట్రీ ఇవ్వ‌బోతోంది జ‌నై భోంస్లే. ఇద్ద‌రం ర‌క్తం పంచుకుని పుట్ట‌క పోయినా తామిద్ద‌రి మ‌ధ్య అలాంటి సంబంధం లేనే లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఇలాంటి వాటిని ప్ర‌చారం చేసే ముందు ఆలోచించాల‌ని, లేదంటే వివ‌ర‌ణ కోరాల‌ని సూచించింది జ‌నై భోంస్లే.

ఇక నుంచి అలాంటి వ్య‌తిరేక ప్ర‌చారం మానుకోవాల‌ని, తామిద్ద‌రిని అన్నా చెల్లెలుగా భావించాల‌ని విన్న‌వించింది. ప్ర‌తి ఒక్క‌రికీ వ్య‌క్తిగ‌త జీవితం అనేది ఒక‌టి ఉంటుంద‌ని, దానికి భంగం క‌లిగించేలా చేయొద్దంటూ కోరింది. తాజాగా స్పందించాడు సిరాజ్. త‌నను సోద‌రిగానే చూశాన‌ని, ఎలాంటి వ్య‌తిరేక భావ‌నలు త‌న‌లో లేవ‌న్నాడు. మొత్తం మీద ఇద్ద‌రికి సంబంధించి క్లారిటీ రావ‌డంతో ఇరువురి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Also Read : Bobby Deol Gift : బాబీ డియోల్ కు బ‌ర్త్ డే గిఫ్ట్

CommentsSirajViralZanai Bhosle
Comments (0)
Add Comment