Zahid Wasim: ‘దంగల్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి జైరా వాసిం ఇంట్లో విషాదం నెలకొంది. ఈమె తండ్రి జహిద్ వాసిం మృతి చెందారు. ఈ విషయాన్ని ఎక్స్ (ట్విట్టర్) ద్వారా జైరా బయటపెట్టింది. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు, ఆమె అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.
Zahid Wasim…
ఇకపోతే జమ్ము కాశ్మీర్‌లో పుట్టి పెరిగిన జైరా వాసిం… ఆమిర్ ఖాన్ ‘దంగల్’ సినిమాలో గీతా ఫొగట్ పాత్రలో బాలనటిగా ఆకట్టుకుంది. దీని తర్వాత ఆమిర్ ఖాన్‌తో ‘సీక్రెట్ సూపర్ స్టార్’ అనే మూవీలో మరోసారి కలిసి నటించింది. ‘స్కై ఈజ్ పింక్’ అనే చిత్రంలోనూ కీలక పాత్ర పోషించింది. నటిగా మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ 2019లో తాను ఇండస్ట్రీకి బైబై చెప్పేసింది. ఇకపై నటించనని క్లారిటీ ఇచ్చేసింది.
Also Read : Kalki 2898 AD : హాలీవుడ్ సంచలనం సృష్టిస్తున్న కల్కి బుజ్జి ఈవెంట్