Chahal-Dhanasri Divorce Shocking :చెదిరిన స్వ‌ప్నం వీడిన వివాహ బంధం

క్రికెట‌ర్ చాహ‌ల్ జంట‌కు విడాకులు మంజూరు

Chahal : ముంబై – ఊహాగానాల‌కు తెర దించారు ప్ర‌ముఖ క్రికెట‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్. త‌న భార్య ధ‌న‌శ్రీ‌కి విడాకులు ఇవ్వ‌డం క‌ల‌క‌లం రేపింది. భార‌త క్రికెట్ జ‌ట్టులో అత్యంత కీల‌క‌మైన స్పిన్న‌ర్ గా పేరు పొందాడు. భారీ ఎత్తున సంపాదించాడు. చాహ‌ల్(Chahal), ధ‌న‌శ్రీ వ‌ర్మ మంచి ల‌వ‌ర్స్ గా ఉన్నారు. నిత్యం సోష‌ల్ మీడియా వేదిక‌గా యాక్టివ్ గా క‌నిపించారు. వారికి సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేస్తూ వ‌చ్చారు. ఫ్యాన్స్ లో మ‌రింత జోష్ లో నింపే ప్ర‌య‌త్నం చేశారు. కానీ ఉన్న‌ట్టుండి వీరిద్ద‌రి మ‌ధ్య పొర‌పొచ్చాలు వ‌చ్చాయి. తాము ఇద్ద‌రం విడి పోవాల‌ని అనుకున్నామంటూ బాంబు పేల్చారు.

Yuzvendra Chahal-Dhanashree Verma Divorce

ఇదే స‌మ‌యంలో ఇద్ద‌రూ క‌లిసి ఓ అంగీకారానికి వ‌చ్చారు. చ‌ట్ట బ‌ద్దంగా విడి పోవాల‌ని నిశ్చ‌యించుకున్నారు. ప‌ర‌స్ప‌ర ఒప్పందం మేర‌కు హైకోర్టును ఆశ్ర‌యించారు త‌మ‌కు విడాకులు ఇప్పించాల‌ని. దీనిపై కోర్టు స్పందిస్తూ ముంబైలోని ఫ్యామిలీ కోర్టుకు బ‌ద‌లాయించింది. విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌స్థానం కీల‌క తీర్పు వెలువ‌రించింది. యుజ్వేంద్ర చాహ‌ల్, ధ‌న‌శ్రీ వ‌ర్మ‌కు విడాకులు మంజూరు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని చాహ‌ల్ త‌ర‌పు న్యాయ‌వాది గుప్తా వెల్ల‌డించారు.

ఇండియ‌న్ క్రికెట్ రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన క్రికెట‌ర్ల‌లో త‌ను కూడా ఒక‌డు. గ‌త ఏడాదిలో ఐపీఎల్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ర‌పున ఆడాడు. కానీ ఎందుక‌నో యాజ‌మాన్యం ఈసారి త‌న‌ను తీసుకోలేదు. దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ వేలం పాట‌లో త‌న‌ను వ‌దులుకోవ‌డం ఒకింత ఆశ్చ‌ర్య పోయేలా చేసింది. త‌నను పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ తీసుకుంది. ఇదిలా ఉండగా చాహ‌ల్ క్రికెట‌ర్ గా గుర్తింపు పొందితే ధ‌న‌శ్రీ వ‌ర్మ కొరియో గ్రాఫ‌ర్ గా పేరు పొందారు.

Also Read : Betting Apps Case Sensational :25 మంది సినీ న‌టులు..యూట్యూబ‌ర్స్ జాబితా 

ChahalDhanushree VermaDivorceShockingUpdatesViral
Comments (0)
Add Comment