Yuvaraj Singh : క్రీడా రంగానికి చెందిన బయోపిక్‌లు ఇప్పటికే ఎన్నో వెండితెరపై అలరించాయి. ఆయా వీరుల కథలను తెరపై చక్కగా ఆవిష్కరించారు మేకర్స్. ఇప్పుడు వాటి సరసన క్రికెటర్ యువరాజ్ సింగ్ బయోపిక్ కూడా చేరనుంది. భారతీయ క్రికెట్ చరిత్రలో యువరాజ్ సింగ్ ఓ సంచలనం. ఒక్క ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టిన ఘనత ఆయనది. ఇప్పుడీ క్రికెట్ వీరుడి జీవిత చరిత్ర సినిమాగా రానుంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన రావడంతో సినీ, క్రీడాభిమానులు ఆనందపడుతున్నారు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణసంస్థ టీ సిరీస్ యువరాజ్ సింగ్ బయోపిక్‌ను రూపొందించనుంది. నిర్మాతలు భూషన్ కుమార్, రవిభాగ్ చందక్ ఈ విషయాన్ని వెల్లడించారు.
Yuvaraj Singh Biopic Movie
త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో హీరోగా ఎవరు కనిపిస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతే కాదు యువీ బయోపిక్‌లో ఏం చూపిస్తారనేది కూడా చర్చ మొదలైంది. యువరాజ్ సింగ్ జీవితం ఓ పోరాటం. క్యాన్సర్‌తో పోరాడి ఆయన ఎంతోమందిలో మనోధైర్యాన్పి నింపారు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. అయితే ఇప్పుడీ చిత్రంలో కేవలం క్రికెట్‌కు సంబంధించిన విషయాలనే చెబుతారా లేదా క్యాన్సర్‌తో అతడు చేసిన పోరాటాన్ని కూడా చూపిస్తారా అన్నది తెలియాలంటే కొంతకాలం వేచిచూడాల్సిందే!
Also Read : Actor Sangeetha : ఆ ఇండస్ట్రీ కంటే తెలుగు ఇండస్ట్రీలో గౌరవం ఉంటుంది