Yuvan Shankar Raja : యువన్ శంకర్ రాజా నిర్మాతగా ఓ కొత్త సినిమా ‘స్వీట్ హార్ట్’

ఇందులో గోపిక రమేష్, రెడిన్‌ కింగ్‌స్లీ, రెంజీ పాణికర్‌, అరుణాచలేశ్వరన్‌, తులసి తదితరులు నటించారు...

Yuvan Shankar Raja : ప్రముఖ సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌ రాజా నిర్మాతగా ‘స్వీట్‌హార్ట్‌’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ‘ నెంజముండు నేర్మైయుండు’, ‘జో’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆలరించిన రియోరాజ్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. స్వినీత్‌ ఎస్‌.సుకుమార్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా టైటిల్‌ ప్రోమో వీడియోను చిత్ర బృందం తాజాగా రిలీజ్‌ చేసింది.

Yuvan Shankar Raja Movie Updates

ఇందులో గోపిక రమేష్, రెడిన్‌ కింగ్‌స్లీ, రెంజీ పాణికర్‌, అరుణాచలేశ్వరన్‌, తులసి తదితరులు నటించారు. సమకాలీన ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రియోరాజ్ హీరోగా నటించిన ‘జో’ సినిమా ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. ఇపుడు ‘స్వీట్‌హార్ట్‌ ను కూడా అలాంటి కథాంశంతోనూ రూపొందించడం గమనార్హం. కాగా, ఈ కొత్త సినిమా ప్రోమోను చూసిన అభిమానులు చిత్ర బృందాన్ని అభినందిస్తున్నారు.

Also Read : Om Shivam Movie : ఓ శివ భక్తుడి జీవిత కథగా వస్తున్న ‘ఓం శివమ్’ సినిమా

CinemaTrendingUpdatesViralYuvan Shankar Raja
Comments (0)
Add Comment