Yodha: ధర్మా ప్రొడక్షన్స్, అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ పతాకాలపై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, శశాంక్ ఖైతాన్, హీరూ యశ్ జోహార్ నిర్మించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’. పుష్కర్ ఓఝా, సాగర్ అంబ్రే సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా, దిశా పటానీ, రాశీ ఖన్నా కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. హైజాక్‌కి గురైన ఒక భారతీయ విమానాన్ని ఉగ్రవాదుల చెర నుంచి సురక్షితంగా రక్షించి… తీవ్రవాదుల్ని మట్టి కరిపించే యోధుడిగా ఆర్మీ కమాండో అరుణ్ కత్యాల్ పాత్రలో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఇప్పుడీ ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన (రూ.349) ఇది అందుబాటులోకి వచ్చింది. మే 10 తర్వాత ఉచితంగా చూడొచ్చు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
Yodha – ‘యోధ’ కథేమిటంటే ?
తన తండ్రి సురేంద్ర కటియాల్ (రోనిత్ రాయ్) స్ఫూర్తితో యోధా(Yodha) టాస్క్‌ఫోర్స్ లో కమాండోగా చేరతాడు అరుణ్ కటియాల్ (సిద్ధార్థ్ మల్హోత్రా). దూకుడుగా వ్యవహరిస్తూ ఆపరేషన్స్ లో పాల్గొనడం అతడి శైలి. ఆ క్రమంలో కొన్నిసార్లు నిబంధనల్ని కూడా అతిక్రమిస్తుంటాడు. ఆయన భార్య ప్రియంవద కటియాల్ (రాశీఖన్నా) కేంద్ర ప్రభుత్వంలో ఉన్నతోద్యోగి. అరుణ్ చేపట్టిన ఓ ఆపరేషన్ ఫెయిల్ కావడంతో ప్రముఖ శాస్త్రవేత్త అయిన అనుజ్ నాయర్ ప్రయాణిస్తున్న విమానం హైజాక్ కు గురికావడంతో, ఉగ్రవాదుల చేతుల్లో ఆయన దారుణ హత్యకు గురవుతాడు. అదంతా సమన్వయలోపంతో జరిగిందని, అరుణ్ తన వాదన వినిపిస్తాడు. ఆ ఆపరేషన్ ప్రభావం అరుణ్, ప్రియంవద వైవాహిక జీవితంపై పడుతుంది. ఆ సంఘటన తర్వాత యోధ టాస్క్‌ఫోర్స్ భవితవ్యమే ప్రశ్నార్థకం అవుతుంది. ఆ తర్వాత ఉగ్రవాదుల కుట్రలను అతడు ఎలా తిప్పికొట్టాడనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
Also Read : Salman Khan: ఇల్లు మారుతున్న సల్మాన్ ఖాన్ ?