Toxic : గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం టాక్సిక్. కన్నడ సూపర్ స్టార్, ప్యాన్ ఇండియా హీరో యశ్ కీలక పాత్ర పోషిస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. శరవేగంగా షూటింగ్ కొనసాగుతోంది. తనతో పాటు మరో కీలక రోల్ పోషిస్తోంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. ఈ మూవీ కోసం తను భారీ ఎత్తున పారితోషకం అందుకుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా టాక్సిక్(Toxic) కు సంబంధించి ఇన్ స్టా గ్రామ్ లో సంచలన ప్రకటన చేశారు మూవీ మేకర్స్. ఇందుకు సంబంధించి వచ్చే ఏడాది 2026 న దీపావళి పండుగ రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతోందంటూ వెల్లడించారు.
Hero Yash Toxic Movie Updates
అంతే కాదు యష్ కు సంబంధించిన అద్భుతమైన పోస్టర్ ను కూడా రిలీజ్ చేయడం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ఇది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్ దుమ్ము రేపింది. బాక్సులు బద్దలు కొట్టింది. ఈ ఒక్క మూవీతో స్టార్ డమ్ వచ్చే సింది యశ్ కు. తన యాక్షన్ తో లక్షలాది మంది ప్రేక్షకులను కట్టి పడేశాడు. మరో వైపు కేజీఎఫ్ సీక్వెల్ ను కూడా అంతే స్థాయిలో ఆదరించారు. ఆ తర్వాత వస్తున్న చిత్రం టాక్సిక్ కావడంతో మరింత ఉత్కంఠను రేపుతోంది అభిమానుల్లో. రామాయణంతో పోటీ పడేందుకు సిద్దమయ్యాడు.
రణ్ బీర్ కపూర్ లవ్ అండ్ వార్ కూడా ఫెస్టివల్ రోజు రిలీజ్ కానుంది. ఈ మేరకు మార్చి 19 న రానుందని తెలిపారు. ఇదే సమయంలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో కపూర్, ఆలియా భట్ , విక్కీ కౌశల్ నటించిన చిత్రం కూడా రానుండడం విశేషం. మరో వైపు రణ్ కబీర్ పూర్, యష్ కలిసి నితేష్ తివారీ దర్శకత్వంలో రామాయణం పార్ 1లో కలిసి పని చేస్తున్నారు.
Also Read : Ananya Nagalla Shocking :తెలియక ప్రమోషన్ చేశా తప్పైంది