Stunning Yami Gautham :యామి గౌత‌మి ధూమ్ ధామ్ హ‌ల్ చ‌ల్ 

యాక్ష‌న్ కామెడీ చిత్రంగా ఓటీటీలో స్ట్రీమింగ్ 

Yami Gautham : యామి గౌత‌మ్, ప్ర‌తీక్ గాంధీ న‌టించిన యాక్ష‌న్ కామెడీ చిత్రం ధూమ్ ధామ్. నెట్ ఫ్లిక్స్ లోకి వ‌చ్చేసింది. యామి(Yami Gautham) చివ‌రి స‌రిగా 2024లో వ‌చ్చిన ఆర్టిక‌ల్ 370 చిత్రంలో క‌నిపించింది. త‌న‌కు కొడుకు పుట్టాక న‌టించిన ధూమ్ ధామ్ రిలీజ్ కావ‌డంతో సంతోషానికి లోన‌వుతోంది. ఓటీటీ సంస్థ‌లు ఈ మూవీ కోసం పోటీ ప‌డినా చివ‌ర‌కు నెట్ ఫ్లిక్స్ చేజిక్కించుకుంది.

Yami Gautham Movie Updates

అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునేలా తీశారు ద‌ర్శ‌కుడు. ప్రేమికుల రోజున గిఫ్ట్ గా ఇచ్చామ‌ని మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు ఇప్ప‌టికే. చెప్పిన‌ట్టుగానే స్ట్రీమింగ్ అయ్యింది. ప్రేక్ష‌కులు త‌మ ఇళ్ల‌ల్లోంచే ధూమ్ ధామ్ ను వీక్షిస్తున్నారు. ఎక్కువ మంది ఇందులో కామెడీ టచ్ చేసింద‌ని అంటుండ‌గా మ‌రికొంద‌రు ప‌ర్వాలేదంటూ పేర్కొంటున్నారు.

కొత్త‌గా పెళ్ల‌యిన జంట ఎలా దుండగుల నుంచి త‌ప్పించు కుంటుంద‌నేది క‌థ‌. దీనిని అందంగా తెరకు ఎక్కించ‌డంలో ద‌ర్శ‌కుడు త‌న ప‌నితీరు క‌నబ‌ర్చాడు. కోయ‌ల్ , వీర్ వివామాన్ని వైభ‌వంగా జ‌రుపుకునేందుకు ప్రేమికుల రోజున ఆహ్వానిస్తున్నామంటూ పేర్కొన్నాడు ద‌ర్శ‌కుడు.

పూర్తిగా హాస్య ప్ర‌ధానంగా క‌థ ఉండ‌డంతో చూసేందుకు మ‌రింత ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ధూమ్ ధామ్ చిత్ర బృందంలో ఐజాజ్ ఖాన్, కవిన్ డేవ్, ముకుల్ చద్దా, ప్రతీక్ బబ్బర్, పవిత్ర సర్కార్, గరిమా యాజ్నిక్ , ముష్తాక్ ఖాన్ ఉన్నారు. ఈ చిత్రానికి ఆదిత్య ధార్ , ఆర్ష్ వోరా రచనలు అందించగా, రిషబ్ సేథ్ దర్శకత్వం వహించారు. దీనిని జ్యోతి దేశ్‌పాండే, ఆదిత్య ధార్,  లోకేష్ ధార్ నిర్మించారు.

Also Read : Beauty Rashmika-Chhaava :చ‌రిత్ర‌కు ద‌ర్ప‌ణం ‘ఛావా’ దృశ్య కావ్యం

MoviesTrendingUpdatesViralYami Gautam
Comments (0)
Add Comment