Yami Gautam: అక్షయ తృతీయ రోజున తల్లయిన బాలీవుడ్ బ్యూటీ !

అక్షయ తృతీయ రోజున తల్లయిన బాలీవుడ్ బ్యూటీ !

Yami Gautam: నటి యామీ గౌతమ్‌ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త ఆదిత్య ధర్‌ సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. అక్షయ తృతీయ పర్వదినాన మాకు మగ బిడ్డ పుట్టాడు. మరొక అందమైన ప్రయాణాన్ని ప్రారంభించాం. అందరి ఆశీస్సులతో మా కుమారుడికి గొప్ప భవిష్యత్తు ఉండాలని కలలు కంటున్నాం. అతడు ఎన్నో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాం. మా కుటుంబానికి అలాగే దేశానికి గర్వకారణమయ్యేలా ఎదగాలని ఆశిస్తున్నాం’ అని ఆదిత్య ధర్ పోస్ట్ లో పేర్కొన్నారు. అలాగే ఆస్పత్రిలో సహకరించిన సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పారు. ఆ బాబుకు ‘వేదవిద్‌’ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఆయన పోస్ట్‌కు నెటిజన్లు శుభాకాంక్షలతో కామెంట్లు చేస్తున్నారు.

Yami Gautam Got Mother

టెలివిజన్‌లో ప్రకటనలతో ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నారు నటి యామీ గౌతమ్‌(Yami Gautam). ‘నువ్విలా’తో తెలుగు తెరకు పరిచయమైన యామీ గౌతమ్‌ పలు బాలీవుడ్‌ సినిమాలతో పాపులర్‌ అయ్యారు. అదే సమయంలో ‘గౌరవం’, ‘యుద్థం’, ‘కొరియర్‌ బాయ్‌ కల్యాణ్‌’ చిత్రాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించారు. ఇటీవల ఆమె నటించిన ‘ఆర్టికల్‌ 370’ ఈవెంట్‌ లో తల్లికానున్నట్లు ప్రకటించారు. ఈ పోస్ట్‌కు పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ కంగ్రాట్స్‌ చెబుతున్నారు. యామీ-ఆదిత్యధర్‌లు 2021లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Also Read : Payal Rajput : పాయల్ రాజపుత్ ను సినిమాల నుంచి తప్పిస్తామంటూ వార్నింగ్

Aditya DharArticle 370Yami Gautam
Comments (0)
Add Comment