Kiki Hakansson : ‘కికీ హకాన్సన్’.. పాప్ కల్చర్ హిస్టరీ ప్రియులకి తెలిసిన పేరే. ఈమె 1951లో బ్రిటన్‌లో తొలిసారి నిర్వహించిన ప్రపంచ విశ్వసుందరి పోటీల్లో తొలి విజేత. స్వీడన్ కి చెందిన ‘కికీ హకాన్సన్‘ బికినీ కాంపిటేషన్ లో గెలిచి ఈ కీరిటం అందుకున్నారు. 1921లో జన్మించిన ఆమె తన 95 ఏళ్లలో ఇటీవల నిద్రలోనే కాలిఫోర్నియాలోని స్వగృహంలో కన్నుమూశారు. ఈ విషయాన్నీ ఆమె కుటుంబ సభ్యులు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా “కికీ శాంతియుతంగా, హాయిగా, ప్రశాంతంగా కన్నుమూసిందంటూ ” తెలిపారు.
Kiki Hakansson No More..
కికీకుమారుడు, క్రిస్ ఆండర్సన్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా “ఎప్పుడు ప్రేమతో సరదాగా గడిపే అమ్మ..ఇపుడు మా మధ్య లేకపోవడం బాధ కలిగిస్తోంది. తన అద్భుతమైన హాస్యం మరియు తెలివి మమల్ని ఎంతో ఉన్నత స్థాయిలో ఉంచాయి” అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఇక ‘మిస్ వరల్డ్’ పోటీల నిర్వాహుకురాలు జూలియా మోర్లీ “కికీ హకాన్సన్ నిజమైన మార్గదర్శకురాలు.. ఈ క్లిష్ట సమయంలో మా ప్రేమను పంపుతూ మరియు మా ప్రార్థనలను అందిస్తూ, కికీ కుటుంబ సభ్యులందరికీ మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము” అంటూ ట్వీట్ చేశారు.
Also Read : Kamal Haasan : నేటితో 70 ఎల్ లోకి అడుగుపెట్టిన అగ్ర నటుడు ‘కమల్ హాసన్’