Thalapathy 69 : థలపతి విజయ్ చివరి సినిమా ఓపెనింగ్ లో కీలక అంశాలు

‘GOAT’ అనే అక్షరాలతో ఉన్న గోల్డ్ రింగ్‌ని విజయ్‌కి నిర్మాత శివ బహూకరించారు...

Thalapathy 69 : దళపతి విజయ్ నటించనున్న చివరి చిత్రం ‘థలపతి 69’ శుక్రవారం పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా మొదలైంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మేకర్స్ చాలా అప్డేట్స్ ఇచ్చారు. హీరోయిన్, ఇతర తారాగణం అంటూ కొన్ని వరుస అప్డేట్స్‌తో ‘థలపతి 69(Thalapathy 69)’ ట్యాగ్ ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక ఈ మూవీ ఓపెనింగ్‌లో అనుకోని సంఘటన జరిగింది. అదేంటని అనుకుంటున్నారా.. ‘థలపతి 69’ చిత్ర ఓపెనింగ్‌కి విజయ్ ఇంతకు ముందు చేసిన సినిమా ‘ది గోట్’ నిర్మాతలలో ఒకరైన శివ కూడా హాజరయ్యారు. వాస్తవానికి ‘ది గోట్’సినిమా అనుకున్నంత సక్సెస్ అయితే కాలేదు. తమిళ్‌లో పర్లేదు కానీ.. ఇతర భాషల్లో మాత్రం ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. అయినా సరే.. ఆ చిత్ర నిర్మాత ‘థలపతి 69’ మూవీ ఓపెనింగ్‌లో పాల్గొని విజయ్‌కు స్పెషల్ గిఫ్ట్‌ని ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఏంటంటే..

Thalapathy 69 Movie Updates

‘GOAT’ అనే అక్షరాలతో ఉన్న గోల్డ్ రింగ్‌ని విజయ్‌కి నిర్మాత శివ బహూకరించారు. ఈ బహుమతిని అందుకున్న విజయ్.. సోషల్ మీడియా వేదికగా ఆ రింగ్‌ని చూపిస్తూ ఓ ఫొటోని షేర్ చేశారు. ఆ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘ థలపతి 69(Thalapathy 69)’ విషయానికి వస్తే ‘తుణివు, వలిమై’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన హెచ్. వినోద్ ఈ చిత్రానికి దర్శకుడు. బుట్టబొమ్మ పూజా హెగ్డే ‘బీస్ట్’ తర్వాత మరోసారి విజయ్‌తో జతకడుతోంది. బాబీ డియోల్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. కె. వి. ఎన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్ర పూజా కార్యక్రమంలో ప్రధాన తారాగణం అంతా పాల్గొంది. విజయ్‌తో పాటు, దర్శకనిర్మాతలు, హీరోయిన్ పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్ వంటి వారంతా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ మూవీ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శనివారం నుంచి ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

ఈ మూవీ అనంతరం విజయ్ పొలిటికల్‌గా బిజీ కానున్నారు. ఇక సినిమాలకు స్వస్తి చెప్పి, ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమైన విజయ్.. ఇటీవల నూతన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ అనే పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. తమిళనాడులో రాబోయే ఎన్నికల సమయానికి విజయ్.. ప్రజలతో మమేకం అయ్యేందుకు పక్కాగా ప్లాన్ చేసుకున్నట్లుగా సమాచారం.

Also Read : Devara-Ananya : దేవర సినిమాలో జాన్వీ పాత్రను ప్రశంసించిన అనన్య పాండే

CinemaThalapathy 69TrendingUpdatesViral
Comments (0)
Add Comment