Weapon: సత్యరాజ్, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో గుహన్ సెన్నియ్యప్పన్ తెరకెక్కించిన తాజా సినిమా ‘వెపన్’. తాన్యా హోప్, రాజీవ్ మేనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మిలియన్ స్టూడియో బ్యానర్ పై ఎం.ఎస్.మన్జూర్ సమర్పణలో గుహన్ సెన్నియప్పన్ నిర్మించిన ఈ సినిమా జూన్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్రబృందం హైదరబాద్ లో విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో వసంత్ రవి, తాన్యా హోప్, రాజీవ్ పిళ్లై, గుహన్ సెన్నియప్పన్ లు వారి వారి పాత్రలతో పాటు సినిమా విశేషాలను వివరించారు. ప్రస్తుతం ఆ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
Weapon Movie Updates
ఈ సందర్భంగా సత్యరాజ్ మాట్లాడుతూ… పెన్, మైక్, వీడియా అనేది రియల్ వెపన్. ఓటు అనేది మరో గొప్ప వెపన్ అంటూ… నేను అందరికీ నమస్కారం మాత్రమే చెబుతున్నాను. ప్రస్తుతం భాష అనేది హద్దుగా లేదని… బాహుబలి సినిమా ఎన్నో భాషల్లోకి వెళ్ళిందని చెబుతూ.. ఈ వెపన్ సినిమా కూడా అలాంటి సినిమా అవుతుందని తెలిపారు. సూపర్ హ్యామన్ సాగా కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించామని… ఇదొక కొత్త ట్రెండ్ సృష్టిందని ఆయన తెలిపారు.
Also Read : Bujji and Bhairava: ‘కల్కి 2898ఏడీ’ కు సంబంధించి బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ ట్రైలర్ విడుదల !